🔱
ఓం హర శంకర హర హర
ఓం హర శంకర హర హర
ఓం హర శంకర
శ్రీ హర శంకర స్తుతి
పల్లవి
వందనం దిగంబర వందిత పురంధరా ॥
ఇందుధర ధురంధర హిమాచలగ్ర మందిరా ।
|| ఓం హర ||1
అంగజ మదసంహార ... హర హర
ఆశ్రిత జనమందార... శివ శివ
గంగాధర మూఢమౌళి... హర హరా
గౌరీ వరదాయకా... శివ శివ
లింగధృత కురంగ వృషభ తురంగ మంగళాకారా
|| ఓం హర ||
❋ ❋ ❋
2
అంజలిధే గజకర్ణా... హర హరా
ఆర్తిని బాపవధేరా... శివ శివ
మంజుల భాషా సుధీరా... హర హరా
మామక దోష నివారణ... శివ శివ
కుంభభవను తుంజ ధైత్య భజనా హరా హరా
|| ఓం హర ||
❋ ❋ ❋
3
కుండలీ భూష మహేశా... హర హర
కుంజర ధనుజ వినాశ... శివ శివ
చండీత హృదయ నివాసా... హర హర
ఖండిత కాలనిపాశ ...శివ శివ
మండలంబులెల్ల నిండి యుండినా పరాత్పరా
|| ఓం హర ||
❋ ❋ ❋
4
దీక్షితి లక్ష్మణ రావు... హర హరా
ఇలవేల్పుడవే నీవు... శివ శివా
దాక్షిణ్యంబిది నావు ...హర హరా
భక్తుల మది నున్నవు... శివ శివ
ఈ క్షణంబు దీక్షణే ఒపేక్ష మోక్ష మెయ్యరా
|| ఓం హర ||