మల్లన్న మల్లన్న
శ్రీ మల్లికార్జున స్వామి జానపద కీర్తన
మల్లన్న మల్లన్న మల్లన్న
నీకు కోటి కోటి దండలే మల్లన్న !! మల్లన్న !!
శ్రీశైల కొండమీద మల్లన
మా నివు సిరిగళ్ళ దేవుడవు మల్లన్న !! మల్లన్న !!
గంగమ్మ లోలుడవు గౌరమ్మ వరడుడవు
జంగమ దేవుడవై జగమేలుతున్నావు
నంది వాహనమెక్కి నలుదిక్కుల దిరిగి
భక్తుల బాధలు బాపుతున్నావయ్య
మల్లన్నా .......
"మా దిక్కు మోకు నివ్య మల్లన్న
మా సక్కనైన దేవుడవే మల్లన్న"
!! మల్లన్న !! మల్లన్న !!
పులి తోలు చుట్టుకొని పువ్వుల్లె మెరిసేవు
బూడిద బుసుకొని భూమండలం ఏలేవు
సంతాన జోలె వేసి బిక్షాటన చేసేవు
ఏమిటని లీల తెలియదాయ తండ్రి
మల్లన్నా .......
లింగ రూపమందు వుండి మల్లన్న
ఈ నింగి నెల నిలుస్తునవ్ మల్లన్న
!! మల్లన్న !! మల్లన్న !!
లింగ రూపమందు వున్నా జంగమయ్య నీకు
గంగా జలములు తెచ్చి అభిషేకించుదుము
నంది వాహనుడైన ఇందువదన
నీకు గంధ పుష్పాలతో పూజింతుము తండ్రి
మల్లన్నా .......
మా పల్లె జనుల దేవుడవే మల్లన్న
నీకు పరిపరి దండలు మల్లన్న
!! మల్లన్న !! మల్లన్న !!
నీకు కోటి కోటి దండలే మల్లన్న !!