రావా దుర్గమ్మతల్లి రవ్వల పందిళ్ళలోకి - భజన పాటల లిరిక్స్

🙏 రావా దుర్గమ్మతల్లి 🙏

నవరాత్రుల భక్తి గీతం
రావా దుర్గమ్మతల్లి రవ్వల పందిళ్ళలోకి
రవ్వల పందిళ్ళలోన ముత్యాలముగ్గులేసి
ముత్యాల ముగ్గులోన రతనాల రాశిపోసి
రతనాల రాశిపైన పీఠమే వేసినాము
రావా - రావా - రావ, రావ, రావ, రావ ॥రావా దుర్గమ్మ॥
1
ఎర్రమాల వేసినాము ఎర్రబట్ట కట్టినాము
ఉదయసంధ్య వేళలోన స్థానాలే చేసినాము
పసుపు, కుంకుమతో పూజలెన్నో చేసినాము
రావా రావా - రావ, రావ, రావ, రావ ॥రావా దుర్గమ్మ॥
2
మల్లెపూలు తెచ్చినాము మాలలే వేసినాము
వేపాకులు తెచ్చినాము తోరణాలు కట్టినాము
మేళా తాళాలతోటి భజనలే చేసినాము
రావా - రావా - రావ, రావ, రావ, రావ ॥రావా దుర్గమ్మ॥
3
మంత్ర తంత్రాలతోటి పూజలే చేసినాము
పులిహోర పొంగళ్లు నైవేధ్యం పెట్టినాము
కర్పూరం వెలిగించి హారతులే ఇచ్చినాము
రావా - రావా రావా, రావ, రావ, రావ ॥రావా దుర్గమ్మ॥

🎵 ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి 🎵

▶ పాట వినండి

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow