అయ్యప్ప నమస్కార శ్లోకములు అర్ధ వివరణ

🛕 శ్రీ భూతనాథ పంచరత్నం 🛕
తెలుగు భావార్థంతో
🔱 శ్లోకం – 1
లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం

పార్వతీ హృదయానంద శాస్తారం ప్రణమామ్యహం
తాత్పర్యం :

లోకైక వీరులు, మహాత్ములచే పూజలందుకొనువారు, సకల లోకాలను సర్వవేళలా రక్షించువారు, కోరిన వారికి కోరినంత వరాలను ప్రసాదించువారు, పార్వతీదేవి ప్రేమకు సంపూర్ణ పాత్రులు, ధర్మాన్ని శాసించి నేర్పించువారు అయిన "శ్రీ ధర్మశాస్తా" వారికి నమస్కరిస్తున్నాను.
🔱 శ్లోకం – 2
విప్ర పూజ్యం విశ్వ వంద్యం విష్ణు శంభో ప్రియం సుతం

క్షిప్ర ప్రసాదం నిరతం శాస్తారం ప్రణమామ్యహం
తాత్పర్యం :

విప్రులు అనగా శ్రేష్ఠ బ్రాహ్మణులు. అట్టి విప్రులచే పూజింపబడువారు, విశ్వమంతా వందించబడువారు, విష్ణు-శివుల ప్రియసుతుడు, శరణు వచ్చిన భక్తులను వెంటనే అనుగ్రహించి కాపాడువారు అయిన "శ్రీ ధర్మశాస్తా" వారికి నమస్కరిస్తున్నాను.
🔱 శ్లోకం – 3
మత్త మాతంగ గమనం కారుణ్యామృత పూరితం

సర్వ విఘ్న హరం దేవం శాస్తారం ప్రణమామ్యహం
తాత్పర్యం :

మదమెక్కిన ఏనుగు వంటి గంభీర నడక గలవారు, భక్తులపై అమితమైన కరుణ చూపువారు, భక్తుల విఘ్నాలను తొలగించువారు, సర్వదేవతా స్వరూపులు అయిన "శ్రీ ధర్మశాస్తా" వారికి నమస్కరిస్తున్నాను.
🔱 శ్లోకం – 4
అస్మత్ కులేశ్వరం దేవం అస్మతౌ శత్రు వినాశనం

అస్మదిష్ట ప్రదాతారం శాస్తారం ప్రణమామ్యాహం
తాత్పర్యం :

మన కులదైవమై మనలను కాపాడి, కామ క్రోధాది అంతఃశత్రువులను నాశనం చేసి, మన కోరికలను నెరవేర్చువారు అయిన "శ్రీ ధర్మశాస్తా" వారికి నమస్కరిస్తున్నాను.
🔱 శ్లోకం – 5
పాండ్యేశవంశ తిలకం భారతీ కేళి విగ్రహం

ఆర్తత్రాణ పరందేవం శాస్తారం ప్రణమామ్యాహం
తాత్పర్యం :

పాండ్యవంశ తిలకమై, కేరళలో బాలుడిగా లీలలు చేసి, ఆపదలో ఉన్న భక్తులను రక్షించే దేవాది దేవుడు అయిన "శ్రీ ధర్మశాస్తా" వారికి నమస్కరిస్తున్నాను.
🔱 శ్లోకం – 6
పంచ రత్నాఖ్య మేతద్యో నిత్యం శుద్ధః పఠేన్నరః

యస్య ప్రసన్నో భగవాన్ శాస్తా వసతి మానసే
తాత్పర్యం :

ఈ శాస్తా పంచరత్న స్తోత్రాన్ని శుద్ధచిత్తంతో నిత్యం పఠించే భక్తునిపై అయ్యప్ప స్వామి ప్రసన్నుడై, అతని మనస్సులో నిత్యం నివసిస్తాడు.
🔱 శ్లోకం – 7
త్రియంబక పూరాదీశం గణాధిప సమన్వితం గజారూడ మహం వందే శాస్తరం కుల దైవతం
తాత్పర్యం :

త్రయంబక పురమనబడే దివ్య స్థానానికి అధిపతియై, గణాధిపుడైన గణపతితో సమానంగా కైలాసమున నివసిస్తూ, ఏనుగు మీదెక్కి వచ్చి భక్తుల కోర్కెలను తీర్చే మన కులదైవ స్వరూపుడైన "శ్రీ ధర్మశాస్తా" వారికి నమస్కరిస్తున్నాను.
🔱 శ్లోకం – 8
యస్య ధన్వంతరీ మాతా పితా రుద్రోభిషక్ నమః

త్వం శస్తర మహం వందే మహావైద్యం దయానిధిం
తాత్పర్యం :

లోకానికి అమృతాన్ని ప్రసాదించిన మహావిష్ణువును తల్లిగా, వైద్యనాథుడైన పరమేశ్వరుణ్ని తండ్రిగా పొందిన మహా వైద్యస్వరూపుడు, దయాసాగరుడు అయిన "శ్రీ ధర్మశాస్తా" వారికి నమస్కరిస్తున్నాను.
🔱 శ్లోకం – 9
అరుణోదయ సంకాశం నీలకుండల ధారిణం

నీలాంబరధరం దేవం వందేహం బ్రహ్మ నందనం
తాత్పర్యం :

అరుణోదయ కాంతివలె ప్రకాశిస్తూ, నీలి రత్న కుండలాలు ధరించి, నీలాంబరాలతో అలంకరించబడి, పరబ్రహ్మ స్వరూపుడై వెలసే "శ్రీ ధర్మశాస్తా" వారికి నమస్కరిస్తున్నాను.
🔱 శ్లోకం – 10
చాప బాణం వామహాస్తే రౌభ్య వేత్రం చ దక్షిణే

విలసత్ కుండల ధరం వందేహం విష్ణు నందనం
తాత్పర్యం :

విల్లు, బాణం ధరించి ధర్మరక్షణకు సిద్ధమై, వెండి దండాన్ని ధరించి, ప్రకాశించే కుండలాలు మరియు దివ్యాభరణాలతో శోభిల్లే శ్రీ మహావిష్ణువు ప్రియసుతుడు "శ్రీ ధర్మశాస్తా" వారికి నమస్కరిస్తున్నాను.
🔱 శ్లోకం – 11
వ్యాఘ్రూరూఢం రక్తనేత్రం స్వర్ణమాలా విభూషణం

వీరపట్టధరం ఘోరం వందేహం శంభు నందనం
తాత్పర్యం :

వ్యాఘ్రంపై విహరిస్తూ, దుష్టులను సంహరించేందుకు రక్తవర్ణ నేత్రాలతో, స్వర్ణమాలలు ధరించి, వీరపట్టంతో అలంకరించబడిన పరమశివుని ప్రియసుతుడు "శ్రీ ధర్మశాస్తా" వారికి నమస్కరిస్తున్నాను.
🔱 శ్లోకం – 12
కింకిణోద్యాణ భూతేశం పూర్ణచంద్ర నిభాననం

కిరాతరూప శాస్తారం వందేహం పాండ్య నందనం
తాత్పర్యం :

కింకిణి గజ్జెల నాదంతో అలంకరించబడి, పూర్ణచంద్రుని వలె ప్రకాశించే ముఖకాంతి కలిగి, కిరాతరూపంలో భక్తులను రక్షించే పాండ్యవంశ తిలకుడైన "శ్రీ ధర్మశాస్తా" వారికి నమస్కరిస్తున్నాను.
🔱 శ్లోకం – 13
భూత భేతాళ సంసేవ్యం కాంచనాద్రి నివాసనం

మణికంఠ మితిఖ్యాతం వందేహం శక్తి నందనం
తాత్పర్యం :

భూత, భేతాళాదులు సేవించే దివ్యపాదాలు కలిగి, కాంతమల స్వర్ణమందిరంలో నివసించి, మణికంఠుడిగా ప్రసిద్ధి పొందిన, పరాశక్తి ప్రియపుత్రుడైన "శ్రీ ధర్మశాస్తా" వారికి నమస్కరిస్తున్నాను.
🔱 శ్లోకం – 14
శ్రీహరిశ పుత్రం దేవం శ్రీహరి శంకరాత్మజం

శబరీ గిరీశ్వరం దేవం నమామి భూతనాయకం
తాత్పర్యం :

శ్రీహరి పుత్రుడవు, హరిహరాత్మజుడవు, శబరిగిరిపై వెలసిన భూతగణాధిపుడవు. ఓ అయ్యప్ప స్వామీ! నీకు శరణాగతి సమర్పిస్తున్నాను.
🔱 శ్లోకం – 15
జగత్ ప్రియం జగన్నాథం జగదానంద దాయకం

జగదీశం కృపా పూర్ణం నమామి మోహనీ సుతం
తాత్పర్యం :

జగత్తుకు ప్రియమైనవాడు, జగన్నాథుడు, సర్వలోకాలకు ఆనందాన్ని ప్రసాదించువాడు, కృపాస్వరూపుడు, మోహిని కుమారుడైన "శ్రీ ధర్మశాస్తా" వారికి నమస్కరిస్తున్నాను.
🔱 శ్లోకం – 16
భూతేశం తారక బ్రహ్మం గిరీశం గిరిజాత్మజం

పరమేశాత్మజం దేవం నమామి పాపనాశనం
తాత్పర్యం :

సకల భూతాలకు నాధుడై, తారక బ్రహ్మస్వరూపుడై, గిరీశుడై, పార్వతీ నందనుడై, పరమేశ్వరుని పుత్రుడై, సర్వ పాపాలను నాశనం చేసే "శ్రీ ధర్మశాస్తా" వారికి నమస్కరిస్తున్నాను.
🔱 శ్లోకం – 17
జనార్ధన సుతం దేవం వాసవేశం మనోహరం

వనవాస ప్రియం దేవం నమామి జగదీశ్వరం
తాత్పర్యం :

జనార్ధనుని కుమారుడై, ఆటవిక వేషధారణతో మనోహర రూపంలో వెలసి, అరణ్యవాసాన్ని ఇష్టపడే జగన్నాథుడు అయిన "శ్రీ ధర్మశాస్తా" వారికి నమస్కరిస్తున్నాను.
🔱 శ్లోకం – 18
పాలనేత్ర సుతం దేవం కలిదోష నివారణం

బాలరూపం లోకనాధం నమామి శబరీశ్వరం
తాత్పర్యం :

ముక్కంటి కొడుకై, కలియుగ దోషాలను నివారించువాడై, బాలరూపంలో వెలసి, లోకనాయకుడై, శబరిగిరీశ్వరుడైన "శ్రీ ధర్మశాస్తా" వారికి నమస్కరిస్తున్నాను.
🙏 శ్రీ భూతనాథ ప్రార్థన
ఓం శ్రీ భూతనాథ సదానంద
సర్వ భూత దయాపర

రక్ష రక్ష మహాబాహో
శాస్తే తుభ్యం నమో నమః
తాత్పర్యం :

భూత, ప్రేత, పిశాచాదులకు అధిపతియై వాటి బాధలను తొలగించే ఓ భూతనాథా! సర్వభూతాలపై అపారమైన దయ కలిగిన పరమాత్మా! నీ దివ్యశక్తులతో మమ్మల్ని ఎల్లప్పుడూ రక్షించి పాలించుమని త్రికరణశుద్ధితో ప్రార్థిస్తున్నాము.
🛕 అయ్యప్ప శరణాగతి
అయ్యప్ప దేవ దేవా శరణం తవైవ

స్వామిన్ మమేవ శబరిగిరి వాసనాథా

అయ్యప్ప హే శరణ మిత్యధి ఘోషయంతో

రక్షాస్వయాయ సతతం వయమార్త బందో
ఓ అయ్యప్ప స్వామీ! నీ దివ్య చరణాలే మాకు శరణు. కరుణాసాగరుడవైన నీవు మమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడుము. శరణాగతులైన భక్తుల ఆర్తిని తొలగించే దయామయుడా! మాకు రక్షణ ప్రసాదించుము.
🌺 అనంత కోటి నమస్కారాలు
ఓం శ్రీ పూర్ణపుష్కళాంభా సమేత
శ్రీ హరిహర పుత్ర స్వామినే నమః

అనంత కోటి ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి
ఓ అయ్యప్ప దేవా! నీ దివ్య చరణాలే మా శరణం. కరుణానిధీ, భక్త చింతామణీ, మమ్మల్ని ఎల్లప్పుడూ అనుగ్రహించి రక్షించుము.

🙏 స్వామియే శరణం అయ్యప్ప 🙏

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow