@ గురువులకే గురువురా @ అయ్యప్ప భజన పాటల లిరిక్స్ @

గురువులకే గురువురా - జనార్ధన్ గురుస్వామి భక్తి గీతం
జనార్ధన్ గురుస్వామి

🙏 గురువులకే గురువురా 🙏

గురువులకే గురువురా.. స్వాముల సద్గురువురా.
ఆ అయ్యప్ప పంపిన దూతరా మన జనార్ధన్ గురుస్వామి

అందాల పంజ కట్టు... ఆ నుదుట గంధం బొట్టు

అయ్యప్ప మెచ్చెటట్టు....

పడి పూజలు జేసుకుంటూ .......ఉ .....

ఎంతో పేరు గాంచి నాడురా మన జనార్ధన్ గురుస్వామి...

మాల వేయలన్నా పడి పూజ జేయలన్నా..

స్వామి పాట పాడలన్నా

పేటతుళ్ళి ఆడలన్నా..........ఆ........

జనార్ధన్ గురు స్వామికి సాటి ఎవ్వరన్నా

అభిషేక పూజలంటు..... తన అలంకారమంటు

పల్లకి సేవలంటు....ఇరుముడులు కట్టుకుంటు

అయ్యప్ప ను తలచుకుంటా.. ఉ.....

స్వామి సేవలో తరియించేరు మన జనార్ధన్ గురు స్వామి

ఆ అయ్యప్ప దాసుడాయేరు మన జనార్ధన్ గురు స్వామి..

శిష్యులు ఎంతో మంది . తనకు భక్తులెంత మంది........

అభిమానులెందరున్నా

తాను గర్వం ఎరగడన్నా....నా........

అఘోర మంత్రం చదివే తంత్రిరా మన జనార్ధన్ గురు స్వామి ...

గురువులకే గురువురా.. స్వాముల సద్గురువురా.
ఆ అయ్యప్ప పంపిన దూతరా మన జనార్ధన్ గురుస్వామి

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow