@ గురువే దైవం గురువే సర్వం గురువే నా ప్రాణం @ అయ్యప్ప భజన పాటల లిరిక్స్ @

గురువే దైవం - శ్రీ శ్రీ జనార్ధన్ గురు స్వామి భక్తి గీతం
శ్రీ శ్రీ జనార్ధన్ గురు స్వామి గారు

🙏 శ్రీ శ్రీ జనార్ధన్ గురు స్వామి గారు 🙏

గురువే దైవం, గురువే సర్వం, గురువే నా ప్రాణం
మా గురు సేవలు చేయుటయే ఈ జన్మకెంతో భాగ్యం, మా జన్మకెంతో భాగ్యం....!!

వదలకు స్వామి ఇప్పుడు నువ్వు ఆ పుణ్య పాదం...

అందరికి అది దొరకదు స్వామి ఇంతటి ఈ మోక్షం.... అదియే పరమార్ధం.....!!

// గురువే దైవం //

అయ్యప్పనే అమ్మానన్నని అర్థము తెలిపావు. పరమార్థము చూపావూ

ఆ పై నీవు గురువే దైవం అయ్యి చూపినావు, స్వామి చెంత చేర్చినావూ.......!!

// గురువే దైవం //

కార్తిక మాసం వచ్చిందంటే కలలోకొస్తావూ మమ్ముల కలవరపెడతావూ...

గురు స్వామి నువు ప్రాణం అంటూ మాలలు వేస్తావూ, నియమాలను చెబుతావూ.....!!

// గురువే దైవం //

మా గురు పాదం తాకినంతనే తనువు పులకరించే అణువణువు పరవశించే...

నన్ను మించినా నాలో శక్తి ఇట్టే అగుపించే పరమార్థం కనిపించే.......!!

// గురువే దైవం //

పలుమార్లు పడి పూజలు చేసిన పుణ్య కరములయ్యా ఆ కర కమలములయ్యా....

శిష్యుల శిరస్సు నిమిరేనయ్యా జన్మ ధన్యమయ్యా మా జన్మ ధన్యమయ్యా....!!

// గురువే దైవం //

పూవులతో మాలలు వేసి వారిని మర్చావూ...... ఒకే కులమును చేశావూ....

మాలో కుల వైషమ్య భావముల నణచి వేసినావూ... స్వామి మార్చినవు.....!!

// గురువే దైవం //

శిష్యులందరిని చిరునవ్వులతో ఆశీర్వదిస్తావూ స్వామి దీవెనలిస్తవు ....

మా కనుల ముందర కనిపించే అయ్యప్పకు ప్రతిరూపం.. ఆ గురువే ఆ రూపం

// గురువే దైవం //

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow