అన్నమయ్య కీర్తన బ్రహ్మ కడిగిన పాదము / Annamayya Keerthana

 బ్రహ్మ కడిగిన పాదము

బ్రహ్మము దానె నీ పాదము ‖

చెలగి వసుధ గొలిచిన నీ పాదము
బలి తల మోపిన పాదము |
తలకగ గగనము తన్నిన పాదము
బలరిపు గాచిన పాదము ‖

కామిని పాపము కడిగిన పాదము
పాముతల నిడిన పాదము |
ప్రేమపు శ్రీసతి పిసికెడి పాదము
పామిడి తురగపు పాదము ‖

పరమ యోగులకు పరి పరి విధముల
పరమొసగెడి నీ పాదము |
తిరువేంకటగిరి తిరమని చూపిన
పరమ పదము నీ పాదము ‖

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow