Aaragimpumu Srihari Lyrics || ఆరగింపుము శ్రీహరి లిరిక్స్ – వెంకటేశ్వర స్వామి భజన పాట

 ఆరగింపుము శ్రీహరి దేవా, అందమైన ఆదిమూర్తి

మధుర మైన మామిడి పండు, పాలు మీగడ,
చక్కర తేనె, పంచ కజ్జియందు గొనుమా

1. పానకమూ, వడపప్పు, కొబ్బరియూ పాయసమూ
చేసితిరా నీ కొరకినే అందుకోరా శ్రీపతి దేవా
కోరినా మాకోర్కెల నొసగి, స్వామి బ్రోవుము
దయతో మమ్ము

ఆరగింపుము శ్రీహరి దేవా, అందమైన ఆదిమూర్తి
మధుర మైన మామిడి పండు, పాలు మీగడ,
చక్కర తేనె, పంచ కజ్జియందు గొనుమా

2. అందముగా నీ మెడలో హారములు వేసెదము
అందమైన మోము చూడ ఆనందమాయెను శ్రీనివాసా
గంధము, పన్నీరు పూసి, గానము చేసెద దేవా

ఆరగింపుము శ్రీహరి దేవా, అందమైన ఆదిమూర్తి
మధుర మైన మామిడి పండు, పాలు మీగడ,
చక్కర తేనె, పంచ కజ్జియందు గొనుమా

3. నీ లీలా జగమంతా నిండెనుగా ఇంటింటా
కానరావా మదిలోనైనా కాచుకొంటి కరుణామూర్తి
నీవే దిక్కని నమ్మియంటి, నీదు నోములు నో చెద స్వామి

ఆరగింపుము శ్రీహరి దేవా, అందమైన ఆదిమూర్తి
మధుర మైన మామిడి పండు, పాలు మీగడ,
చక్కర తేనె, పంచ కజ్జియందు గొనుమా

4. నిజమైన నీరూపు కనపడదే క్షణమైనా
కన్నులారా చూసేద దేవా చుంచుచుంటి నీకై
ఎదురు గరుడు వాహన వేగమ రావా,
గరుడ వాహన వేగమే రావా

ఆరగింపుము శ్రీహరి దేవా, అందమైన ఆదిమూర్తి
మధుర మైన మామిడి పండు, పాలు మీగడ,
చక్కర తేనె, పంచ కజ్జియందు గొనుమా

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow