Kalyanam Lyrics | కళ్యాణము చూతము లిరిక్స్ – రాముడి భజన పాట

 కళ్యాణము చూతము రారండి

శ్రీసీతా రాముల కళ్యాణము చూతము రారండి

1. చూచు వారలకు చూడ ముచ్చటట
పుణ్య పురుషులకు ధన్య భాగ్యమట
భక్తి యుక్తులకు యుక్తి ప్రదమట ఆ… ఆ… ఆ…
సురలను మునులను చూడ వచ్చునట

కళ్యాణము చూతము రారండి
శ్రీసీతా రాముల కళ్యాణము చూతము రారండి

2. దుర్జన కోటికి దర్శమనంచగ
సజ్జన కోటిని సంరక్షింపగ
దారుణి శాంతిని స్థాపన చేయగ ఆ… ఆ… ఆ…
నరుడి పుట్టిన పురుషోత్తముని

కళ్యాణము చూతము రారండి
శ్రీసీతా రాముల కళ్యాణము చూతము రారండి

3. దశరద రాజుకు సుతుడై వెలసి
కౌశిక యాగము రక్షణ జేసి
జనకుని సభలో హరి విలు విరచి ఆ… ఆ… ఆ…
జానకి మనసు గెలచిన రాముని

కళ్యాణము చూతము రారండి
శ్రీసీతా రాముల కళ్యాణము చూతము రారండి

4. సిరి కళ్యాణము బొట్టున పెట్టి బొట్టున పెట్టి
మణి బాసికమును నుదుటన కట్టి నుదుటన కట్టి
పారాణిని పాదాలకు బెట్టి ఆ… ఆ… ఆ…
పారాగిని పాదాలకు బెట్టి పెండ్లి కుతురై వెలసిన సీతా

కళ్యాణము చూతము రారండి
శ్రీసీతా రాముల కళ్యాణము చూతము రారండి

5. రాముని దోసిట నీలపు రాశై
జానకి దోసిట కెంపుల ప్రాలై
అణిముత్యములె తలంబ్రాలుగా ఆ… ఆ… ఆ…
అణిముత్యములె శిరమున వెలసిన సీతారాముల
కళ్యాణము చూతుము రారండి

కళ్యాణము చూతము రారండి
శ్రీసీతా రాముల కళ్యాణము చూతము రారండి

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow