గాయత్రీ మంత్రం ఘనపాఠః
ఓం భూర్భువ॒స్సువః॒ తథ్స॑వి॒తుర్వరే᳚ణ్యం॒ భర్గో॑ దే॒వస్య॑ ధీమహి । ధియో॒ యో నః॑ ప్రచోదయా᳚త్ ॥
ఓం తథ్స॑వి॒తు - స్సవి॒తు - స్తత్త॒థ్స॑వి॒తుర్వరే᳚ణ్యం॒-వఀరే᳚ణ్యగ్ం సవి॒తు స్తత్తథ్స॑వి॒తుర్వరే᳚ణ్యమ్ ।
స॒వి॒తుర్వరే᳚ణ్యం॒-వఀరే᳚ణ్యగ్ం సవి॒తు-స్స॑వి॒తుర్వరే᳚ణ్యం భర్గో॒ భర్గో॒ వరే᳚ణ్యగ్ం సవి॒తు-స్స॑వితు॒ర్వరే᳚ణ్యం॒ భర్గః॑ ।
వరే᳚ణ్యం॒ భర్గో॒ భర్గో॒ వరే᳚ణ్యం॒-వఀరే᳚ణ్యం॒ భర్గో॑ దే॒వస్య॑ దే॒వస్య॒ భర్గో॒ వరే᳚ణ్యం॒-వఀరే᳚ణ్యం॒ భర్గో॑ దే॒వస్య॑ ।
భర్గో॑ దే॒వస్య॑ దే॒వస్య॒ భర్గో॒ భర్గో॑ దే॒వస్య॑ ధీమహి ధీమహి దే॒వస్య॒ భర్గో॒ భర్గో॑ దే॒వస్య॑ ధీమహి ।
దే॒వస్య॑ ధీమహి ధీమహి దే॒వస్య॑ దే॒వస్య॑ ధీమహి । ధీ॒మ॒హీతి॑ ధీమహి ।
ధియో॒ యో యో ధియో॒ ధియో॒ యో నో॑ నో॒ యో ధియో॒ ధియో॒ యోనః॑ ॥
యో 0నో॑ నో॒ యో యోనః॑ ప్రచో॒దయా᳚త్ప్రచో॒దయా᳚న్నో॒ యో యోనః॑ ప్రచో॒దయా᳚త్ ।
నః॒ ప్ర॒చో॒దయా᳚త్ ప్రచో॒దయా᳚న్నో నః ప్రచో॒దయా᳚త్ । ప్ర॒చో॒దయా॒దితి॑ ప్ర-చో॒దయా᳚త్ ।
ఓం భూః । ఓం భువః । ఓగ్ం సువః । ఓం మహః । ఓం జనః । ఓం తపః । ఓగ్ం స॒త్యమ్ ।
ఓం తథ్స॑వి॒తుర్వరే᳚ణ్యం॒ భర్గో॑ దే॒వస్య॑ ధీమహి ।
ధియో॒ యో నః॑ ప్రచోదయా᳚త్ ॥
ఓమాపో॒ జ్యోతీ॒ రసో॒ఽమృతం॒ బ్రహ్మ॒ భూ-ర్భువ॒-స్సువ॒రోమ్ ॥
దేవతలు - గాయత్రీ మంత్రాలు
- అగ్ని గాయత్రి - ఓమ్ మహా జ్వాలాయ విద్మహే అగ్నిదేవాయ ధీమహి, తన్నో అగ్నిః ప్రచోదయాత్.
- ఇంద్ర గాయత్రి - ఓమ్ సహస్ర నేత్రాయ విద్మహే వజ్రహస్తాయ ధీమహి, తన్నోఇంద్రః ప్రచోదయాత్.
- కామ గాయత్రి - ఓమ్ కామదేవాయ విద్మహే పుష్పబాణాయ ధీమహి, తన్నోऽనంగః ప్రచోదయాత్.
- కృష్ణ గాయత్రి - ఓమ్ దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి, తన్నోకృష్ణః ప్రచోదయాత్.
- గణేశ గాయత్రి - ఓమ్ ఏకదంష్ట్రాయ విద్మహే వక్రతుండాయ ధీమహి, తన్నోదంతిః ప్రచోదయాత్.
- గురు గాయత్రి - ఓమ్ సురాచార్యాయ విద్మహే వాచస్పత్యాయ ధీమహి, తన్నోగురుః ప్రచోదయాత్.
- చంద్ర గాయత్రి - ఓం క్షీర పుత్రాయ విద్మహే అమృతతత్త్వాయ ధీమహి, తన్నోశ్చంద్రః ప్రచోదయాత్.
- తులసీ గాయత్రి - ఓం శ్రీతులస్యై విద్మహే విష్ణుప్రియాయై ధీమహి, తన్నో బృందాః ప్రచోదయాత్.
- దుర్గా గాయత్రి - ఓం గిరిజాయై విద్మహే శివప్రియాయై ధీమహి, తన్నోదుర్గా ప్రచోదయాత్.
- నారాయణ గాయత్రి - ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి, తన్నోనారాయణః ప్రచోదయాత్.
- నృసింహ గాయత్రి - ఓం ఉగ్రనృసింహాయ విద్మహే వజ్రనఖాయ ధీమహి, తన్నోనృసింహః ప్రచోదయాత్.
- పృథ్వీ గాయత్రి - ఓం పృథ్వీదేవ్యై విద్మహే సహస్రమూర్త్యై ధీమహి, తన్నోపృథ్వీ ప్రచోదయాత్.
- బ్రహ్మ గాయత్రి - ఓం చతుర్ముఖాయ విద్మహే హంసారూఢాయ ధీమహి, తన్నోబ్రహ్మః ప్రచోదయాత్.
- యమ గాయత్రి - ఓం సూర్యపుత్రాయ విద్మహే మాహాకాలాయ ధీమహి, తన్నోయమః ప్రచోదయాత్.
- రాధా గాయత్రి - ఓం వృషభానుజాయై విద్మహే కృష్ణ ప్రియాయై ధీమహి, తన్నోరాధా ప్రచోదయాత్.
- రామ గాయత్రి - ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి, తన్నోరామః ప్రచోదయాత్.
- లక్ష్మీ గాయత్రి - ఓం మహాలక్ష్మ్యేచ విద్మహే విష్ణుప్రియాయై ధీమహి, తన్నోలక్ష్మీః ప్రచోదయాత్.
- వరుణ గాయత్రి - ఓం జలబింబాయ విద్మహే నీల పురుషాయ ధీమహి, తన్నోవరుణః ప్రచోదయాత్.
- విష్ణు గాయత్రి - ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి, తన్నోవిష్ణుః ప్రచోదయాత్.
- శని గాయత్రి - ఓమ్ కాక ధ్వజాయ విద్మహే ఖడ్గ హస్తాయ ధీమహి, తన్నో మందః ప్రచోదయాత్.
- శివ గాయత్రి - ఓం పంచవక్త్రాయ విద్మహే మహాదేవాయ ధీమహి, తన్నోరుద్రః ప్రచోదయాత్
- సరస్వతీ గాయత్రి - ఓం సరస్వత్యై విద్మహే బ్రహ్మపుత్ర్యై ధీమహి, తన్నోదేవీ ప్రచోదయాత్.
- సీతా గాయత్రి - ఓం జనక నందిన్యై విద్మహే భూమిజాయై ధీమహి, తన్నోసీతాః ప్రచోదయాత్.
- సూర్య గాయత్రి - ఓం భాస్కరాయ విద్మహే దివాకరాయ ధీమహి, తన్నోసూర్యః ప్రచోదయాత్.
- హనుమద్గాయత్రి - ఓం అంజనీ సుతాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి, తన్నోమారుతిః ప్రచోదయాత్.
- హయగ్రీవ గాయత్రి - ఓం వాగీశ్వరాయ విద్మహే హయగ్రీవాయ ధీమహి, తన్నోహయగ్రీవః ప్రచోదయాత్.
- హంస గాయత్రి - ఓం పరమహంసాయ విద్మహే మాహాహాంసాయ ధీమహి, తన్నోహంసః ప్రచోదయాత్.
- శ్రీ అయ్యప్ప గాయత్రి - ఓం భూకనాథాయ విద్మహే భావపుత్రాయ ధీమహి, తన్నోషష్టా ప్రచోదయాత్.
- శ్రీ శ్రీనివాస (వేంకటేశ్వర) గాయత్రి - ఓం నిరంజనాయ విద్మహే నిరాధారాయ ధీమహి, తన్నోవేంకట ప్రచోదయాత్.
- శ్రీ కార్తికేయ (షణ్ముఖ) గాయత్రి - ఓం తత్ పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి, తన్నోషణ్ముఖ ప్రచోదయాత్.
- వృషభ గాయత్రి - ఓమ్ ధీక్ష శృంగాయ విద్మహే వేద హస్తాయ ధీమహి, తన్నో వృషభ ప్రచోదయాత్.
ప్రతి పదార్థం
గాయత్రీ మంత్రం లోని ప్రతి అక్షరం బీజాక్షరమని మహిమాన్వితమైనదని విజ్ఞుల భావన. ఈ మంత్రం జపిస్తే సకల దేవతలను స్తుతించినట్లని పెద్దలచే సూచింపబడింది. మంత్రంలోని ప్రతి పదానికి అర్ధం క్రింద చూడండి.
- ఓం = పరమేశ్వరుడు సర్వరక్షకుడు.
- భూః = సత్ స్వరూపుడు (ఉనికి కలవాడు).
- భువః = చిత్ స్వరూపుడు (జ్ఞాన రూపుడు).
- స్వః = ఆనంద స్వరూపుడు (దుఃఖరహితుడు).
- తత్ = అట్టి సచ్చినానంద లక్షణయుక్తమైన పరమేశ్వరుడు.
- సవితుః = ఈ సృష్టి కర్త.
- వరేణ్యం = సుఖ స్వరూపుడగుటచే జీవులందరి చేత ఆరాధింపబడేవాడు.
- భర్గః = శుద్ధ స్వరూపుడు (పాప రహితుడు).
- దేవస్యః = అట్టి అనేక దివ్యగుణములు కలిగిన దేవుని యొక్క దివ్యస్వరూపము.
- ధీమహి = హ్రుదయాంతరాల్లో (ఆత్మలో ఏకమై)
- యః = ఆ పరమేశ్వరుడు.
- నః ద్యః = మా బుద్ధులను.
- ప్రచోదయాత్ = సత్కర్మలయందు ప్రేరేపించి అభ్యుదయ శ్రేయములు పొంద సమర్ధం చేయుగాక.
చతుర్వింశతి గాయత్రీ
గాయత్రీ మంత్రంలో యిరువది నాలుగు అక్షరములతో పాటు యిరువది నాలుగు దేవతా మూర్తుల శక్తి అంతర్గతంగా నుండును.ఈ యిరువది నాలుగు గాయత్రీ మూర్తులకు చతుర్వింశతి గాయత్రీ అనిపేరు.
| క్రమ సంఖ్య | అక్షరము | దేవతా మూర్తి | క్రమ సంఖ్య | అక్షరము | దేవతా మూర్తి | |
| 1 | తత్ | విఘ్నేశ్వరుడు | 13 | ధీ | భూదేవి | |
| 2 | స | నరసింహస్వామి | 14 | మ | సూర్య భగవానుడు | |
| 3 | వి | మహావిష్ణువు | 15 | హి | శ్రీరాముడు | |
| 4 | తుః | శివుడు | 16 | ధి | సీతాదేవి | |
| 5 | వ | శ్రీకృష్ణుడు | 17 | యో | చంద్రుడు | |
| 6 | రే | రాధాదేవి | 18 | యో | యముడు | |
| 7 | ణ్యం | శ్రీ మహాలక్ష్మి | 19 | నః | బ్రహ్మ | |
| 8 | భ | అగ్ని దేవుడు | 20 | ప్ర | వరుణుదు | |
| 9 | ర్గోః | ఇంద్రుడు | 21 | చో | శ్రీమన్నారాయణుడు | |
| 10 | దే | సరస్వతీ దేవి | 22 | ద | హయగ్రీవుడు | |
| 11 | వ | దుర్గాదేవి | 23 | య | హంసదేవత | |
| 12 | స్య | ఆంజనేయస్వామి | 24 | త్ | తులసీమాత |
ఈ ఇవరై నాలుగు దేవతా మూర్తులకు మూలాధారమైన ఈ గాయత్రీ మంత్రాన్ని జపిస్తే కీర్తి, దివ్య తేసస్సు, సకల సంపదలు, సమస్త శుభాలు కలుగుతాయి.
ఋషి పుంగవుల ప్రశంస
- గాయత్రికి బ్రహ్మకు భేదం లేదు. —వ్యాస మహర్షి
- ముక్తిపొందుటకు గాయత్రిమంత్రం మూలకారణం. —శృంగి మహర్షి
- గాయత్రి మంత్రం జన్మమరణముల బంధం నుండి విముక్తి లభింప చేస్తుంది. —గాయత్రి మంత్ర ద్రష్ట విశ్వా మిత్ర మహర్షి
- గాయత్రి మంత్రం పాపములను నశింపజేయును. —యాజ్ఞ వల్క్యుడు
- గాయత్రి మంత్రం బ్రహ్మను (పరమాత్మను) సాక్షాత్కరింప చేస్తుంది. —భరద్వాజుడు
- గాయత్రి మంత్రఉపాసన దీర్ఘాయువు కలిగించును. —చరకుడు
- గాయత్రి మంత్రజపం వలన దుర్మార్గుడు పవిత్రుడై (సన్మార్గుడు) పోవును. —వశిష్ట మహర్షి
- గాయత్రి వేదములకు మాత.ఈ జగత్తుకూ గాయత్రి మాతయే. —మహాదేవుడు
- గాయత్రి సర్వశ్రేష్టమైన మంత్రం. దీనినే గురుమంత్రమందురు. ప్రాచీనకాలం నుండి దీనిని ఆర్యులందరూ జపించుచూ వచ్చిరి. —దయానంద మహర్షి
మహాపురుషుల ప్రశంస
- గాయత్రి జపం నాలుగు దిశల నుండి శక్తిని తీసుకుని వచ్చును. —రవీంద్రనాధ్ ఠాగూర్
- గాయత్రి మంత్రం జీవాత్మకు ప్రకాశమిచ్చును. —బాలగంగాధర తిలక్
- గాయత్రి జపం భౌతిక అభావములను కూడా దూరం చేయును. —మదన మోహన మాలవ్య
- గాయత్రి జపం వలన గొప్ప శక్తి లభించును. —రామకృషణ పరమహంస
- గాయత్రి మంత్రం సదుబుద్ధినిచ్చు గొప్ప మంత్రం. —వివేకానంద
- గాయత్రి మంత్రం కామరుచి నుండి తప్పించి రామ రుచి వైపు (రామ రుచి వైపు) మళ్ళించును. —రామతీర్ధ
- గాయత్రి ప్రార్థన సార్వబౌమిక (అందరూ చేయతగిన) ప్రార్థన. —డా.సర్వేపల్లి రాధాకృష్ణ
- గాయత్రి మంత్రము లోని శబ్ధములు సమ్మోహనకరమైనవి, అవి పవిత్రపరచు ఉత్తమ సాధనములు. —మహాత్మా హంసరాజ్
- హిందూమతం ఆరాధన
ప్రధాన అంశాలు ఆచారాలు పూజ హోమం - యజ్ఞం
- అగ్నిచయనం
- అగ్నిహోత్రం
- అగ్నికార్యం
- ఔపాసన
- ధుని
- కామ్యకర్మ
- ప్రవర్గ్య
- పురుషమేధ
- పుత్రకామేష్టి
- విరజాహోమము
ఇతరములు - ఆచమనం
- అర్చన
- ఆశీర్వచన
- అశ్వమేధం
- దర్శనం
- కర్మకాండ
- కుంభాభిషేకం
- నిత్యకర్మ
- పంచాయతపూజ
- ప్రాణప్రతిష్ట
- సంధ్యావందనం
- శుద్ధి
- శ్రౌత
- ఉపకర్మ
- ప్రార్థన
- ధ్యానం
మంత్రములు - ఓం
- హరే కృష్ణ (మంత్రం)
- ఓం నమః శివాయ
- గాయత్రీ మంత్రం
- ఓం నమో నారాయణాయ
- ఓం నమో భగవతే వాసుదేవాయ
- ఓం శ్రీ గణేషాయ నమః
- ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః
విషయములు పదార్థములు సామానులు - డోలక్
- హార్మోనియం
- కరతలాస
- ఖోల
- మంజీరా
- మృదంగం
- తబలా
ప్రతిమ నిర్మాణ శాస్త్రం స్థలములు పాత్రలు పవిత్ర జంతువులు పవిత్ర మొక్కలు వృక్షాలు - అక్షయవట
- అశోకవృక్షం
- వటవృక్షము
- కదంబం
- కల్పవృక్షం
- పారిజాతం
- రావి
- పవిత్ర వనాలు
పండ్లు, ఇతర మొక్కలు ఇవి కూడా చూడండి - సంస్కారం
- దేవాలయనృత్యం
- షోడశ సంస్కారాలు