83 ఉయ్యాల పూల ఉయ్యాల గంగమ్మతల్లికి - అమ్మవారి భజన పాటల లిరిక్స్


సాకి:- శ్రీ... గంగామాతృయేనమః
         గంగ యమున సరస్వతి
         తుంగబద్ర గోదావరి చంద్రబాగ
         నర్మద కావేరి కృష్ణ నదులు
         నీదురూపమై వెలసి
         సకల ప్రానుల జీవనాదారమై
         విష్ణు పాదమున ఉద్భవించిన
         గంగా మాత నమస్తే...నమహ..


ఉయ్యాల పూల ఉయ్యాల
గంగమ్మతల్లికి జంపాల


భక్తుల మొరలను విని విని అలసి
విసిగి వేసారిన శ్రీ గంగమతల్లి
పట్టు పానుపులేసి ఉయ్యాల - 2
గంగమ్మతల్లికి జోలాల                           

||ఉయ్యాల||

సేవించె సమయము మించెను తల్లి
శయనించి శాంతించు శ్రీ గంగమతల్లి
పన్నీటిజల్లుల ఉయ్యాల - 2
గంగమ్మతల్లికి జొలాల                           

||ఉయ్యాల||

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow