66. కామాక్షి మీనాక్షి శరణమమ్మ తల్లీ - Kamakshi Meenakshi Sharanamamma talli - అమ్మవారి భజన పాటల లిరిక్స్

 కంచిలో కామాక్షివే ... మధురలో మీనాక్షివే అమ్మలగన్నఅమ్మవే ... నువ్వాది పరాశక్తివే


*పల్లవి :*

కామాక్షి మీనాక్షి శరణమమ్మ తల్లీ 

నువ్ ఆది పరాశక్తివే శరణమమ్మా తల్లీ        ||2||


*చరణం : 1* 

శృంగేరి శారదాంబ మైసూరు చాముండి       ||2||

విజయవాడ కనకదుర్గవే మాయమ్మ తల్లి కలకత్తా కాళిమాతవే   ||2||

॥ కామాక్షి మీనాక్షి ॥

*చరణం : 2*

నందనవరం చౌడమ్మా ఆలంపురం జోగులాంబ ||2||

శ్రీశైలం భ్రమరాంబవే మాయమ్మ తల్లి కాశి అన్నపూర్ణేశ్వరివే ||2||

॥ కామాక్షి మీనాక్షి ॥

*చరణం : 3*

సమయపురం మారియమ్మ కన్యాకుమారియమ్మా    ||2|| 

శబరిమలై మంజుమాతవే మాయమ్మ తల్లి బాసరలో చదువలమ్మవే  ||2||

॥ కామాక్షి మీనాక్షి ॥

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow