సాయంకాల సమయంలో...వచ్చేను తల్లీ వరలక్ష్మీ - అమ్మవారి భజన పాటల లిరిక్స్

 సాయంకాల సమయంలో సంధ్యా దీపారాదనలో వచ్చేను తల్లీ వరలక్ష్మీ

వచ్చేను తల్లీ మహాలక్ష్మీ||కోరస్||


కాళ్లకు గజ్జలు కట్టింది 

ఘల్లు ఘల్లున వచ్చింది

అడిగినవన్ని ఇచ్చింది

అందరిని దీవించింది||2|| 

||సాయంకాల సమయంలో||

వజ్రకిరీటం చూడండి

ముత్యాల హారం చూడండి

నాగాభరణం చూడండి

దేవి రూపం కనరండి||2||

||సాయంకాల సమయంలో||

అందరు చేరగ రారండి

ముత్తయుదువులను పిలవండి

పసుపు కుంకుమలివ్వండి

పచ్చని గాజులు పంచండి

||సాయంకాల సమయంలో||



#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow