42. శ్రీ రామ నీవేరా నా జీవము l Sri Rama Neevera naa jeevamu

 కీరవాణి రాగం : ఆది తాళం

సాకి    :- కోటి జన్మల ఫలంఋ నీ నామస్మరణ
             జపియించు నా మనము క్షణము క్షణము
             రామా...కారుణ్యధామా నమో...నమస్తే.

పల్లవి  :- శ్రీ రామ నీవేరా నా జీవము
              ఓ రామ నీవేరా నా సర్వము -2                  (శ్రీ రామ)

చరణం:- యుగయుగాలకు జగజగాలకు
              ధర్మము చాటిన ధర్మావతారుడౌ -2
              రాతిని నాతిగా చేసిన దొరవే -2
              నీ సాటి దైవము ఇలలోన మాకెవరు.          (శ్రీ రామ)

చరణం:- శరణాగత బిరుదాంకితుడౌ నీవు
              శరణను వారిని కరుణించే హరివే -2
              రఘపతి రాఘవ రాజారామా -2
              రయముగ బ్రోవర సాకేతపురదామా.          (శ్రీ రామ)

కోరస్  :- శ్రీ రామ్ జయరామ్ జయజయరామ్ -4 సార్లు
             శ్రీ రామ్ జయరామ్ జయజయరామ్

సాకీ   :- రామా......శ్రీ రామా......భద్రాచలరామా.


#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow