🕉️ శ్రీ శివమహాపురాణం 🕉️
త్రిమూర్తులు, దేవీమాతలు అతనివైపు ప్రసన్నంగా చూశారు.
‘‘వత్సా! ఇప్పటికి పరిస్థితులు అనుకూలమైనవని ఏమరిపాటుతో ప్రవర్తించకూడదు సుమా! మంచి, చెడుల మధ్య సంఘర్షణ తలెత్తుతూనే ఉంటుంది. అందుకు కారణం గర్వాహంకారాలే! వాటిని దరిచేరనీయకుండా మసలుకోవాలి.
భూలోకంలో ఇప్పుడు ఋషి, మునులకు యజ్ఞయాగాలు సక్రమంగా జరుపుకునే అవకాశం ఏర్పడింది. ఆ ప్రశాంత వాతావరణంలో జీవించడానికి ఒక జంట అవతరించబోతున్నది... చూడండి!’’
— బ్రహ్మదేవుడు
✨ దివ్య సృష్టి ✨
సభలోని వారందరూ సంభ్రమాశ్చర్యాలతో చూస్తుండగా త్రిమూర్తుల నుండి తేజస్సులు వెలువడి క్రమంగా కలిసి ఒక పురుషాకృతిని దాల్చాయి.
దేవీమాతల ముగ్గురి నుండి వెలువడిన దివ్య తేజస్సులు కలసి ఒక అపూర్వ సౌందర్యవతి రూపాన్ని పొందాయి.
ఆ దివ్య జంటను చూసి దేవతలందరూ ఆశ్చర్యచకితులయ్యారు.
‘‘ఆహా! అసమాన సౌందర్యంతో అలరారుతున్నారు. వీరిని ఎందుకు సృష్టించినట్లు?’’ అంటూ అందరూ కుతూహలంగా ఆ జంటవైపు చూశారు.
🌺 శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ 🌺
‘‘సుందరదత్తుడు, లీలావతి అనబడే మీరిద్దరూ దంపతులై భూలోకంలో ధర్మమార్గాన జీవించండి. గృహస్థాశ్రమ ధర్మాన్ని నెరవేర్చుతూ ఆదర్శప్రాయమైన జీవితాన్ని గడపండి.’’
‘‘మీ ఆజ్ఞను శిరసావహిస్తున్నాము.’’
అంటూ నమస్కరించి ఆ దివ్య దంపతులు భూలోకాన్ని చేరుకున్నారు.
🌿 బదరికాశ్రమ జీవితం 🌿
సుందరదత్తుడు, లీలావతి బదరికారణ్య ప్రాంతానికి చేరుకుని ఆశ్రమం నిర్మించుకొని మునులతో కలిసి ధర్మమార్గంలో జీవించసాగారు.
కొద్దికాలంలోనే తమ వినయం, సేవాభావం, సత్ప్రవర్తనతో అందరి ప్రేమాభిమానాలను సంపాదించారు.
🌸 మునుల ప్రశంస 🌸
‘‘ఈ జంటను చూస్తుంటే ఎంతో ముచ్చట వేస్తోంది.
సుందరదత్తుడు పేరుకు తగ్గట్టే అందగాడు. అందరికీ దత్తపుత్రుడిలా గౌరవం చూపుతున్నాడు.
లీలావతి ఆదర్శ గృహిణి. పెద్దలను గౌరవిస్తూ అందరితో ప్రేమగా మెలుగుతోంది.
వీరు వచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి కొత్త కళ వచ్చింది.’’
ఆ ప్రశంసలు అతిశయోక్తులు కావు.
దత్తుడు, లీలావతి మనసా, వాచా, కర్మణా ఎవ్వరినీ నొప్పించకుండా జీవించారు.
పరులకు ఉపకారం చేస్తూ ఆనందంగా గడుపుతున్న వారి జీవితంలో ఒకరోజు ఊహించని మలుపు వచ్చింది.
🌺 ఒక రోజు... 🌺
‘‘లీలావతి! ఒకసారి ఇలారా... నీతో ఒక ముఖ్య విషయం చెప్పాలి.’’
లోపల పనిలో ఉన్న లీలావతి భర్త పిలుపు విని బయటకు వచ్చింది.
ఆశ్రమం ముందు అరుగుపై కూర్చున్న దత్తుడు ఆమెను చూసి,
‘‘ఇట్లా కూర్చో లీలా!’’ అన్నాడు.
‘‘ఏమిటి చెప్పండి?’’
అని లీలావతి భర్త ముఖంలోకి పరిశీలనగా చూస్తూ అడిగింది.
‘‘ఈవేళ ఉదయం నుండి ఎందుకో గంభీరంగా ఉన్నారు. ఏ విషయం గురించి ఆలోచిస్తున్నారు?’’
🕉 వైరాగ్య సంకల్పం 🕉
దత్తుడు ప్రశాంతంగా మాట్లాడటం ప్రారంభించాడు.
‘‘మనకు వయస్సు మీద పడుతోంది. ఈ గృహస్థాశ్రమాన్ని త్యజించి సన్యసించి తపస్సులో కాలం గడపాలన్న సంకల్పం నాలో కలిగింది.’’
💔 లీలావతి ఆవేదన 💔
అతని మాట పూర్తికాకముందే లీలావతి ఆందోళనతో చెప్పింది.
‘‘ఏమిటండీ వింతగా మాట్లాడుతున్నారు?
మనకు సంతాన భాగ్యం కూడా కలగలేదు. నాకు ఇంకా సంసార సుఖాలపై మోహం తీరలేదు.
మీరు సన్యసించి తపస్సుకు వెళ్లడమేమిటి?’’
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏