_*🚩అయ్యప్ప చరితం - 20 వ అధ్యాయం🚩*_

🕉️ మంత్రి కుతంత్రం 🕉️
మణికంఠుని మీద రాజదంపతుల వాత్సల్యానురాగాలు, ప్రజల ప్రేమాభిమానాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇది మంత్రి వీరబాహుకు అస్సలు నచ్చలేదు. రాజుకు సంతానం లేకపోవడంతో రాజ్యం తన చేతికి వస్తుందని భావించిన మంత్రి, మణికంఠుని రాకతో తన ఆశలు చెదిరిపోయాయని భావించాడు. అందుకే ఎలాగైనా మణికంఠుని తన మార్గం నుంచి శాశ్వతంగా తొలగించాలని కుట్రలు పన్నసాగాడు.
❝ మహామంత్రీ! ఏమిటి... ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్లున్నారు? ❞
మంత్రి వద్దకు వచ్చిన సేనాపతి కూడా మణికంఠునిపై ప్రజల ప్రేమను చూసి అసూయతో రగిలిపోతున్నాడు. ఇద్దరూ కలిసి మణికంఠుని అంతం చేయడానికి రహస్య పథకం రచించారు.
❝ మహామంత్రి! నాకొక ఉపాయం తోస్తోంది. ఎవరికీ అనుమానం రాకుండా ఇలా చేస్తే... ❞
సేనాపతి చెప్పిన పథకం విన్న మంత్రి ఆనందంతో ఉప్పొంగిపోయాడు. "ఇంకా ఆలస్యం ఎందుకు? వెంటనే బయలుదేరుదాం" అంటూ ఇద్దరూ వేషాలు మార్చుకుని రహస్య మార్గంలో బయటకు వెళ్లిపోయారు.
🕉️ ☘️ 🕉️ ☘️ 🕉️
మణికంఠుని అస్వస్థత
❝ ప్రభూ! ప్రభూ! రాకుమారుడు తీవ్రమైన అస్వస్థతకు గురయ్యారు. మంచం మీద నుంచి లేవలేకపోతున్నారు! ❞
పరిచారికల మాటలు విన్న రాజదంపతులు ఆందోళనతో మణికంఠుని శయనగారానికి పరుగెత్తారు. మణికంఠుడు తీవ్ర బాధతో సతమతమవుతున్నాడు. శరీరం శక్తిహీనమై కదలలేకపోతున్నాడు. బంగారు వర్ణం నల్లగా మారిపోయింది. చర్మమంతా వ్రణాలతో నిండిపోయింది.
❝ పుత్రా! మణికంఠా! ఇతరుల బాధలు తీర్చే నీవు ఇలా బాధపడటం మాకు భరించలేకపోతున్నాం. త్వరగా కోలుకోవాలి కుమారా... ❞
రాణి కన్నీరు మున్నీరుగా విలపిస్తుండగా, రాజు వెంటనే రాజవైద్యులను పిలిపించాడు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow