🦁 అహోబిల నరసింహ మా స్వామి 🦁
శ్రీ అహోబిల నరసింహ స్వామి దివ్య భక్తి గీతం
సాకి
అహోబిలం మహాబలం
శ్రీ నరసింహుని దివ్యదర్శనము
మహావరం మహావరం మహావరం
పల్లవి
అహోబిల నరసింహ మా స్వామి నరసింహా
మా అండ నీవుండ రావయ్య జయసింహా...
రావయ్య జయసింహా.
చరణం ౧
నిను నమ్మువారికి తొలగు భయములు
నిను కీర్తించిన కలుగు జయములు - 2
దశావతార హే నారాయణ
దర్శన మీయవయ్యా లక్ష్మీ నరసింహా.
!! అహో !!
చరణం ౨
సర్వము నీవే శ్రీ నరసింహా
సాదుపోషక జయ నరసింహా
జగతిలో నీవు మము కరుణించగ
ఆహోబిలంబున వెలసిన దేవా.
!! అహో !!