@వక్రతుండ మహాకాయ @ Vakratunda Mahakay@వినాయక భజన పాటల లిరిక్స్

జై గణేశ దేవా

వక్రతుండ మహాకాయ ఓం మహా గణపతి (2)
దయ రాదా నీకు ఇంకా ఓ స్వామి దారిచూపు మాకు కొంత

జై గణేశ జై గణేష జై గణేశ దేవా (2)

పామరులను మేమంతా పాలించుము భగవంత (2)
పాడేము భక్తకోటి ఓ స్వామి నొసగు మయ్య మాకు ముక్తి

జై గణేశ జై గణేష జై గణేశ దేవా (2)

పల్లకి మో సేము సేవలెన్నో చేసేము
చేసేము నీ భజనలు ఓ స్వామి అందుకో మా పూజలు

జై గణేశ జై గణేష జై గణేశ దేవా (2)

సర్వలోక వందిత సర్వలోక పూజిత
సర్వదేవ శాస్త్ర రూప ఓ స్వామి ఓంకార శ్రీకారా

జై గణేశ జై గణేష జై గణేశ దేవా (2)

🙏 ఓం గం గణపతయే నమః 🙏

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow