02. ఆదిదేవుడవు నీవయ్య - వినాయక భజన పాటల లిరిక్స్ - Aadi devudadu neevayya

గణపతి బప్పా మోరియా

ఆదిదేవుడవు నీవయ్య అందరి దైవం నీవయ్య
అంధకారములో ఉన్న వారిని వెలుగులోకి తేవయ్య

గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా

నీ పూజలు చేయనిదే ఏ పూజలు చేయరయా
నీ నామం పలకనిదే ఏ నామం పలకరయా

గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా

తల్లి మాటను పాలించుటకై తండ్రినే ఎదురించిన ఘనుడవయ్య
తల్లిని తండ్రిని మించిన దైవం వేరే లేదని చాటితివయ్యా

గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow