స్వాగతాలు స్వాగతాలు స్వాములారా / Swagataalu swagataalu swamulara - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

🙏 స్వాగతాలు స్వాగతాలు స్వాములారా ॥2॥ 🙏
స్వామి పూజకు అయ్యప్ప పూజకు ॥2॥

జంటలుగా రారండి స్వామి శరణు కోరండి ॥2॥
॥ స్వాగతాలు ॥
ఎన్నో దినముల దీక్షలోన - ఎన్నెన్నో తప్పులను చేసినాము ॥2॥
తప్పులన్ని ఒప్పుకుంటే శరణు మీకు కలదండి ॥2॥
॥ స్వాగతాలు ॥
భక్తి కొలది చేయు పూజ - ముక్తి కొరకు చేయు పూజ ॥2॥
భక్త కోటి చేసేది భక్తితో ఈ ! పూజ ॥2॥
॥ స్వాగతాలు ॥
మనుజ జన్మ సార్థకానికి - మేమెరిగిన మార్గ మొక్కటే ॥2॥
మకర జ్యోతి దర్శనం మీకు చూపు నిదర్శనం ॥2॥
॥ స్వాగతాలు ॥
🕉️ స్వామియే శరణం అయ్యప్ప 🕉️

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow