పూసిన కుసుమాలన్ని / Pusina kusumaalanni - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

🌺 పూసిన కుసుమాలన్ని ఎన్ని ఉన్నా 🌺
అన్ని నీ సేవలోనే ధరియించునా
పుట్టిన మానవులందరూ ఎందరున్నా
అందరు నీ సేవ చేసే భాగ్యముండునా
నిను చూడని ఈ జన్మ వ్యర్థమే కదా
నిను చేరే దారి నివ్వు హృదయేశ్వరా
॥ పూసిన ॥
శరణాలు చెప్పుకుంటు వింటున్నాము
పూజల్లో స్వాములకు దైవం నేనన్నావు
స్వామి అని పిలిచినా పలకవెందుకు........ అయ్యప్ప,
నీ పాద దాసులపై అలక ఎందుకు
॥ పూసిన ॥
అయ్యా అంటే ఆదరించి, అప్పా అంటే ఆదుకొనీ
ఆ సంభ వాసులకు అయ్యప్పగా నిలిచావు
ఆరాధించే మమ్మెందుకు ఆదుకోలేవు........... అయ్యప్పా,
శరణమనగా కరుణించవ శబరీశ్వరా
॥ పూసిన ॥
అమ్మ కోసం అడవికెళ్ళి పులి పాలు తెచ్చావు
మహిషిని వధియించి మహిమలెన్నో చూపావు
మము కావగా రాలేవా మణికంఠుడా............అయ్యప్ప,
మా ఇంట మకర జ్యోతివై ఉండవా
॥ పూసిన ॥
🙏 స్వామియే శరణం అయ్యప్ప 🙏

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow