🙏 శరణం శరణమయా - స్వామీ శరణం శరణమయా - అయ్యప్ప 🙏
శరణం శరణమయా - స్వామీ శరణం శరణమయా - అయ్యప్ప
శరణం అన్నామరణము లేదు శబరీగిరి నిలయా
శరణం అన్నామరణము లేదు శబరీగిరి నిలయా
॥ శరణం ॥
అందరి దేవుడవే స్వామి ఆదరించు దేవుడవే - అయ్యప్ప
అయ్యప్ప దేవుడవే స్వామి అరణ్య వాసుడవే
అయ్యప్ప దేవుడవే స్వామి అరణ్య వాసుడవే
॥ శరణం ॥
హరి హర పుత్రుడవే స్వామి ఆనంద రూపుడవే - అయ్యప్ప
మోహిని పుత్రుడవే స్వామి మోహన రూపుడవే
మోహిని పుత్రుడవే స్వామి మోహన రూపుడవే
॥ శరణం ॥
మహిషీ మర్ధనుడా స్వామి మదగజవాహనుడా - అయ్యప్ప
వన్పులి వాహనుడా నీకు వందనము చేసెదము
వన్పులి వాహనుడా నీకు వందనము చేసెదము
॥ శరణం ॥
గజముఖ సోదరుడా స్వామి షణ్ముఖ సోదరుడా - అయ్యప్ప
కారణజన్ముడవే స్వామి కావగ రావయ్య
కారణజన్ముడవే స్వామి కావగ రావయ్య
॥ శరణం ॥
కార్తీక మాసాన స్వామి నీ మాల వేసుకొంటూ - అయ్యప్ప
నలుబది దినములూ స్వామి దీక్షతో కొలిచెదము
నలుబది దినములూ స్వామి దీక్షతో కొలిచెదము
॥ శరణం ॥
ఇరుముడి మోసుకొని స్వామి నిన్నె తలచుకొని - అయ్యప్ప
శబరిగిరి చేరీ నిన్నే దర్శించు కొందాము
శబరిగిరి చేరీ నిన్నే దర్శించు కొందాము
॥ శరణం ॥
పాలాభిషేకమయా నీకు నెయ్యాభిషేకమయా - అయ్యప్ప
చేయగా చూశాము నీకు శరణం పలికెదము
చేయగా చూశాము నీకు శరణం పలికెదము
॥ శరణం ॥
తప్పులు ఎన్నెన్నో మేము అనుదినం చేసినను - అయ్యప్ప
తండ్రివోలే దరి చేర్చి మము దయతో బ్రోవుమయా
తండ్రివోలే దరి చేర్చి మము దయతో బ్రోవుమయా
॥ శరణం ॥
🕉️ స్వామియే.........
🙏 యే శరణమయ్యప్ప 🙏
🙏 యే శరణమయ్యప్ప 🙏