📿
🥥
🪔
🐯
🏔️
🕉️
🙏 కన్నెస్వామి 🙏
~ శబరిమల యాత్ర గీతం ~
📿 🥥 📿
🙏 కన్నెస్వామి ఓ కన్నెస్వామి
కన్నెస్వామి ఓ కన్నెస్వామి 🙏
కన్నెస్వామి ఓ కన్నెస్వామి 🙏
వేయికనులు చాలవులే – మన అయ్యప్పనూ చూడ
ఇరుముడిని కట్టుకొని – మనం ఎరిమేలి పోదాము
వేషాలే వేద్దామా – పేటతల్లై ఆడుదాము
కొబ్బరికాయ ఒకటికొట్టి – ఓవరుని మ్రొక్కుదాము ॥ కన్నెస్వామి ॥
ఇరుముడిని కట్టుకొని – మనం ఎరిమేలి పోదాము
వేషాలే వేద్దామా – పేటతల్లై ఆడుదాము
కొబ్బరికాయ ఒకటికొట్టి – ఓవరుని మ్రొక్కుదాము ॥ కన్నెస్వామి ॥
ఆలుదాకు చేరుకుని – స్నానాలే చేద్దాము
పంబాకు చేరుకుని – స్నానాలు చేద్దాము
కొబ్బరికాయ ఒకటి కొట్టి – గణపతిని మ్రొక్కుదాము
శరంగుత్తి చేరుకుని – శరణాలు గ్రుచ్చుదాము ॥ కన్నెస్వామి ॥
పంబాకు చేరుకుని – స్నానాలు చేద్దాము
కొబ్బరికాయ ఒకటి కొట్టి – గణపతిని మ్రొక్కుదాము
శరంగుత్తి చేరుకుని – శరణాలు గ్రుచ్చుదాము ॥ కన్నెస్వామి ॥
కొబ్బరికాయ ఒకటికొట్టి – పద్దెనిమిది మెట్లు ఎక్కి
పరవశం పొందుదాము – నెయ్యాభిషేకమును
ఘనముగా చేద్దాము – సంక్రాంతి రోజున – జ్యోతినే చూద్దాము
హారతినే ఇద్దాము – శరణమంటు వేడుదాము ॥ కన్నెస్వామి ॥
పరవశం పొందుదాము – నెయ్యాభిషేకమును
ఘనముగా చేద్దాము – సంక్రాంతి రోజున – జ్యోతినే చూద్దాము
హారతినే ఇద్దాము – శరణమంటు వేడుదాము ॥ కన్నెస్వామి ॥