రంగైనా రతనాల
పల్లవి:
రంగైనా రతనాల అందమైన శబరిమల
మము దయతో చూడగరావయ్యా శబరిగిరీ అయ్యప్పా
|| రంగైనా ||
నీవుండేది శబరిమలా! మేముండేది పాలమూరు
మము దయతో చూడగరావయ్యా శబరిగిరీ అయ్యప్పా
|| రంగైనా ||
నీ తల్లీ మోహిని నీ తండ్రీ హరిహరుడు
మము దయతో చూడగరావయ్యా శబరిగిరీ అయ్యప్పా
|| రంగైనా ||
కార్తీక మాసాన మాలాలే వేసితిమి
మండలాకాలంలో దీక్షాలే చేసితిమి
మము దయతో చూడగరావయ్యా శబరిగిరీ అయ్యప్పా
|| రంగైనా ||
ఇరుముడులూ కట్టుకోని నెత్తిమీద పెట్టుకోని
మేము గురుస్వాముల వెంబడి వస్తున్నాము అయ్యప్పా
మము దయతో చూడగరావయ్యా శబరిగిరీ అయ్యప్పా
|| రంగైనా ||