అయిదు కొండల స్వామి ఇంకైనా రాడేమి / idu kondala Swamy Inkaina Rademi - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

అయిదు కొండల స్వామి ఇంకైనా రాడేమి

అయిదు కొండల స్వామి ఇంకైనా రాడేమి
ఇంకైనా రాడేమి మా చిన్ని ముద్దుల స్వామి

ఎన్ని కొండలు ఎక్కిన గాని కన్నుల గల రాడేమీ
కన్నుల గల రాడేమి మా కోరికలు తీర్చ రావయ్యా

శబరి కొండపై పీఠం వేసి ఉల్లాసంగా ఉన్నావా
ఉల్లాసంగా ఉన్నావా బహు క్షేత్రంలో నిలిచి ఉన్నావా

గణపతి కుమార స్వాముల తోటి ఆటలాడుతున్నావా
ఆటలాడుతున్నావా బహు పాటలు పడుతున్నావా

కొండ కోన యాత్ర చేసి స్వామి సన్నిధి చేరితిమి
స్వామి సన్నిధి చేరితిమి ఆ దివ్య రూపం చూడంగా

పంబా నదిలో స్నానమాడితే జన్మ ధన్యమైంది
జన్మ ధన్యమైంది మకరజ్యోతి చూడంగా

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow