🌺 ప్రతి భక్తుని హృదయం ఒక శబరిమల 🌺
🎵 పల్లవి 🎵
ప్రతి భక్తుని హృదయం ఒక శబరిమల
భూలోక కల్పతరువు శబరిమల
॥ ప్రతి భక్తుని ॥
ఓంకారం నినదించే వేదమల
స్వామి మనకోసం కొలువుండే ముక్తిమల
॥ ప్రతి భక్తుని ॥
🎵 చరణం – 1 🎵
వేదాంత వేద్యుడిని భక్తితో పూజించే
మానవాళి కల్పతరువు శబరిమల
॥ వేదాంత వేద్యుడిని ॥
ధనుర్మాస రాత్రులలో శ్వేతమల
నెర నమ్మితే అభయమొసగు శక్తిమల
॥ ప్రతి భక్తుని ॥
🎵 చరణం – 2 🎵
స్వామినే ఎదమోసే భాగ్యశాలి శబరిమల
భక్తజనులనోదార్చే మాతృమూర్తి ఆమల
॥ స్వామినే ఎదమోసే ॥
మకరజ్యోతి వెలుగొందే పుణ్యమల
ముక్తిమార్గాన నడిపించే శబరిమల
॥ ప్రతి భక్తుని ॥
॥ స్వామియే శరణం అయ్యప్ప ॥