🕉️ స్వామి అయ్యప్పా 🕉️
శరణమయ్యప్పాయా
స్వామి అయ్యప్పా... శరణమయ్యప్పాయా
నిన్నే నమ్ముకున్న కరుణించుమయ్యప్ప.
దీనజన రక్షక మా దిక్కు నీవయ్యా.
నిన్నే నమ్ముకున్న కరుణించుమయ్యప్ప.
దీనజన రక్షక మా దిక్కు నీవయ్యా.
1
శరణుఘోష
శరణుఘోష పాడుకుంటూ నిన్ను వేడుకుంటున్నా.
నాకెమూటలు ఒద్దు సిరులు సంపదలు ఒద్దు.
నా ఆత్మలో నీవు ఉంటే.........................
నాకెమూటలు ఒద్దు సిరులు సంపదలు ఒద్దు.
నా ఆత్మలో నీవు ఉంటే.........................
నా ఆత్మలో నీవు ఉంటే, అంతకన్నా మిన్న లేదు.
✦ ✦ ✦ 🌺 ✦ ✦ ✦
2
ఆదరించవేమయ్య
అలసిపోయి నిలిచి ఉన్న ఆదరించవేమయ్య.
అంతర్యామివి నీవే అన్నదాన ప్రభువు నీవే.
చేతులెత్తి మొక్కుతున్న చింత బాపవేమయ్య.
నీ గుడి వాకిట నేనూ.........................
అంతర్యామివి నీవే అన్నదాన ప్రభువు నీవే.
చేతులెత్తి మొక్కుతున్న చింత బాపవేమయ్య.
నీ గుడి వాకిట నేనూ.........................
నీ గుడి వాకిట నేనూ, దివ్వెనైతే చాలున్నాయా.
✦ ✦ ✦ 🌺 ✦ ✦ ✦
3
స్వామి నిన్నే నమ్ముకున్న
మెతుకుకు గతి లేకున్నా మేడలా మాల వేసుకున్న.
కష్టాలెన్నెదురైనా స్వామి నిన్ను నమ్ముకున్న.
మోక్షమిచ్చు స్వామివని నిన్ను వేడుకుంటున్న.
నీ పాదమునంటివున్న.........................
కష్టాలెన్నెదురైనా స్వామి నిన్ను నమ్ముకున్న.
మోక్షమిచ్చు స్వామివని నిన్ను వేడుకుంటున్న.
నీ పాదమునంటివున్న.........................
నీ పాదమునంటివున్న, మువ్వనైతే చాలున్నాయా.
✦ ✦ ✦ 🌺 ✦ ✦ ✦
4
నీ శరణుఘోష
మరువను నీ శరణుఘోష, నా ఊపిరికి ఆగుదాకా.
నా హృదయము స్వామి నీకు, కోవెలగ చేసినను.
నా శ్వాసని స్వామి నీకు హారతిగా ఇచ్చెదను.
ఆ క్షణం అయ్యప్ప అంటూ.........................
నా హృదయము స్వామి నీకు, కోవెలగ చేసినను.
నా శ్వాసని స్వామి నీకు హారతిగా ఇచ్చెదను.
ఆ క్షణం అయ్యప్ప అంటూ.........................
ఆ క్షణం అయ్యప్ప అంటూ, హాయిగా కాను మూస్తానయ్య.