Andala shivahari balaa @అందాల శివ హరి బాలా.@- అయ్యప్ప భజన పాటల లిరిక్స్

🙏 అందాల శివ హరి బాలా 🙏

అందాల శివ హరి బాలా...
పందాల జన పరిపాల...
ఆ పంబా తీరాన పడగనీడ లాడిన వాడా...
॥ చరణం – 1 ॥
కైలాసగిరి లోన కొలువైన నీ తండ్రి...
వైకుంఠపురమున సేదతీరిన తల్లి...
నడుమ భూలోకాన నాకోసం వచ్చినావా...
బంగారు కన్నయ్య నా తండ్రి అయ్యప్ప...
॥ చరణం – 2 ॥
ముక్కోటి దేవతలు మొక్కేటి ఇంద్రుడే...
పులి వాహనమాయే ఏ పూర్వ పుణ్యమాయే...
ఏ రీతిగా నన్ను కరుణించుదలచవో...
నీ పాదచరణాల పడియుండనీవయ్యా...
॥ చరణం – 3 ॥
మహిషిని కరుణించి మానవ రూపమిచ్చి...
మాలికాపురత్తమ్మగా నీ పక్కన నిలిపినావు...
నీ మాల వేసి నేను నీ స్మరణ చేసినాను...
నాయందు దోషమున్న నన్ను మన్నించరాదా...
॥ చరణం – 4 ॥
నా కనులు చూసేను నీ దివ్యరూపాన్ని...
నా మనసు పాడేను నీ మధుర గానాన్ని...
రాగాల తోటలోని పూలన్నీ ఏరుకొచ్చి...
గానాల పూలమాల నీకోసం అల్లినాను...
॥ చరణం – 5 ॥
ధనం ఏది నాకు లేదు, నీ దయ నాకు చాలు...
నా జీవనానికి దిక్కు నీవయ్యా...
నా ప్రాణం ఉండేదాకా...
ఈ జీవం ఉండేదాకా...
నీ పాట పాడుతాను,
నీ గాన సేవలోనే తరించిపోతాను...
🙏 ॥ స్వామియే శరణం అయ్యప్ప ॥ 🙏

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow