🕉️ మణికంఠ నీ నామమే వెన్నెల 🕉️
─── అయ్యప్ప కీర్తన ───
మణికంఠ నీ నామమే వెన్నెల
శబరిమల నీ స్థానమే వెన్నెల
॥ మణికంఠ ॥
శబరిమల నీ స్థానమే వెన్నెల
॥ మణికంఠ ॥
॥ చరణం ౧ ॥
మళయాళ దేశమంట వెన్నెలో వెన్నెలపందళ రాజుడంట వెన్నెలో వెన్నెల
హరిహర తనయుడంట వెన్నెలో వెన్నెల
అందాల బాలుడంట వెన్నెలో వెన్నెల
ఏడేడు లోకాలు వెన్నెల
నీవు పాలించగ వచ్చినాడు వెన్నెలో వెన్నెల
॥ మణికంఠ ॥
॥ చరణం ౨ ॥
శ్రీధర్మ శాస్తుడంట వెన్నెలో వెన్నెలశబరిగిరి వాసుడంట వెన్నెలో వెన్నెల
విళ్లాలి వీరుడంట వెన్నెలో వెన్నెల
వీరమణి కంఠుడంట వెన్నెలో వెన్నెల
పులిపాలు తెచ్చినాడు వెన్నెల
తల్లిబాధ తీర్చినాడు వెన్నెలో వెన్నెల
॥ మణికంఠ ॥
॥ చరణం ౩ ॥
ముగ్గురన్నదమ్ములంట వెన్నెలో వెన్నెలవీరాధివీరులంట వెన్నెలో వెన్నెల
రాజాధిరాజులంట వెన్నెలో వెన్నెల
రాజకుమారులంట వెన్నెలో వెన్నెల
జ్యోతిస్వరూపుడంట వెన్నెల
స్వామి వైభోగం చూడాలి వెన్నెలో వెన్నెల
॥ మణికంఠ ॥
॥ చరణం ౪ ॥
నీ మాల వేసినాము వెన్నెలో వెన్నెలనీ దీక్ష బూనినాము వెన్నెలో వెన్నెల
ఇరుముడులే కట్టినాము వెన్నెలో వెన్నెల
శబరిగిరికి చేరినాము వెన్నెలో వెన్నెల
మకరసంక్రాంతినాడు వెన్నెల
జ్యోతినే చూశాము వెన్నెలో వెన్నెల
॥ మణికంఠ ॥
🕉️ మణికంఠ నీ నామమే వెన్నెల 🕉️