ముద్దుముద్దుగున్నావు స్వామి అయ్యప్ప - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

🕉️ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్పా 🕉️

10. ముద్దుముద్దుగున్నావు ...
॥ పల్లవి ॥
ముద్దుముద్దుగున్నావు స్వామి అయ్యప్ప
కంటిపాప రెప్పవేయకుండా చూస్తూ మురిసిపోయే స్వామి అయ్యప్ప
ఎంతసక్కగున్నావు స్వామి అయ్యప్ప
సుక్కల్లో చంద్రునిలా వెలిగినావు స్వామి అయ్యప్ప
స్వామి అయ్యప్ప...స్వామి అయ్యప్ప
స్వామి అయ్యప్ప...శరణమయ్యప్ప
॥ చరణం ౧ ॥
నియమాల నీ మాలలో ఉన్నాము స్వామి అయ్యప్ప
నిష్ఠతో ఇష్టంగా దీక్ష చేసుకుంటున్నాము స్వామి అయ్యప్ప
పొద్దుమాపు నీ ఊసులే చెప్పుకుంటున్నాము స్వామి అయ్యప్ప
నీ భక్తి కంబళి కప్పుకుంటున్నాము స్వామి అయ్యప్ప
॥ చరణం ౨ ॥
నీ పూజచేస్తూ పులకించినాము స్వామి అయ్యప్ప
నీ పాటపాడుతూ పరవశించినాము స్వామి అయ్యప్ప
రోజు రోజు తలచుకొని తరించినాము స్వామి అయ్యప్ప
మనసందు నిలుపుకోని మైమరచినాము స్వామి అయ్యప్ప
॥ చరణం ౩ ॥
ఇరుముడులు కట్టుకుంటాము స్వామి అయ్యప్ప
మాతలపైనా పెట్టుకుంటాము స్వామి అయ్యప్ప
నీ పాదాలు పట్టుకుంటాము స్వామి అయ్యప్ప
మనసెట్టి మొక్కుతుంటాము స్వామి అయ్యప్ప
🕉️ స్వామి అయ్యప్ప...శరణమయ్యప్ప 🕉️

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow