నన్ను నడిపే దైవమా l అయ్యప్ప భజన పాటల లిరిక్స్

🕉️ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్పా 🕉️

20. నన్ను నడిపే ...
॥ పల్లవి ॥
నన్ను నడిపే దైవమా
నాలోని భక్తి భావమా
నీ చరణమ్ములే నే నమ్మితి
శరణంటూ చేసితి సన్నుతి
స్వామి శరణం అయ్యప్ప
నీ చరణం శరణం అయ్యప్ప
॥ చరణం ౧ ॥
దారి తెలియని ఎడారిలో
నీ దారి నాకు చూపినావు
దిక్కు తెలియని వేళలో
నా దిక్కు నీవై నడిపినావు
నా గతివి నీవు మతివి నీవు
నీవే నాకు శరణ్యము
॥ చరణం ౨ ॥
నిన్ను నమ్మని నాచే
నీ మాలనే వేయించినావు
పూజలేరుగని నాతో
నీ పూజలే చేయించినావు
కనుముందు నీవే కదులుతూ
మనసందు నీవే మెదిలినావు
॥ చరణం ౩ ॥
అహము విడచి ఇహము మరచి
నీ పరమ పదములే పాడితి
నిన్ను పిలుచుతూ నిన్ను తలచుతూ
నీ చరణమ్ములే నే వేడితి
నా పెన్నిధివి నీవేనంటూ
నీ సన్నిధిని నే కోరితి
🕉️ స్వామియే శరణం అయ్యప్ప 🕉️

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow