పంపాలో వెలసిన దేవా మహానుభావా - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

🕉️ పంపాలో వెలసిన దేవా 🕉️

─── అయ్యప్ప కీర్తన ───
పంపాలో వెలసిన దేవా మహానుభావా
॥ చరణం ౧ ॥
జగతికి నీవే దిక్కయ్యా పరుగున నీవు రావయ్యా
మమ్మాదుకోను రావయ్యా శరణుఘోష వినగా రావయ్యా
అయ్యన్ అయ్యప్పవే హరిహర పుత్రుడా
॥ పంపాలో ॥
॥ చరణం ౨ ॥
విళ్ళాలి వీర రావయ్యా వీరమణికంఠ రావయ్యా
మమ్మాదుకోను రావయ్యా శరణుఘోష వినగా రావయ్యా
అయ్యన్ అయ్యప్పవే హరిహర పుత్రుడా
॥ పంపాలో ॥
॥ చరణం ౩ ॥
అన్నదాన ప్రభువా రావయ్యా ఆపద్భాంధవ రావయ్యా
మమ్మాదుకోను రావయ్యా శరణుఘోష వినగా రావయ్యా
అయ్యన్ అయ్యప్పవే హరిహర పుత్రుడా
॥ పంపాలో ॥
॥ చరణం ౪ ॥
మహిషీ మర్ధన రావయ్యా మోహనరూపా రావయ్యా
మమ్మాదుకోను రావయ్యా శరణుఘోష వినగా రావయ్యా
అయ్యన్ అయ్యప్పవే హరిహర పుత్రుడా
॥ పంపాలో ॥
॥ చరణం ౫ ॥
కలియుగ వరదా రావయ్యా మమ్మాదుకోను రావయ్యా
కరుణామూర్తి రావయ్యా శరణుఘోష వినగా రావయ్యా
అయ్యన్ అయ్యప్పవే హరిహర పుత్రుడా
॥ పంపాలో ॥
॥ చరణం ౬ ॥
జ్యోతి స్వరూపా రావయ్యా మకర జ్యోతీ రావయ్యా
మమ్మాదుకోను రావయ్యా శరణుఘోష వినగా రావయ్యా
అయ్యన్ అయ్యప్పవే హరిహర పుత్రుడా
॥ పంపాలో ॥
🕉️ పంపాలో వెలసిన దేవా మహానుభావా 🕉️

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow