🕉️ కన్నుల నిండే కమనీయ రూపం 🕉️
─── అయ్యప్ప కీర్తన ───
॥ పల్లవి ॥
కన్నులనిండే కమనీయ రూపంహరిహర పుత్రుని దివ్య స్వరూపం
మానవ జగతికి జ్ఞానము నొసగే
జ్యోతి స్వరూపా అయ్యప్పా
॥ కన్నుల ॥
॥ చరణం ౧ ॥
మాలను వేసి నిను కీర్తించిశరణు ఘోషతో నీకై నడచి
ఇరుముడి కట్టి శిరమున దాల్చి
ఆశా మోహిత పదములు వీడి
వేడుకలోన వేదనలోన కొలిచెదమయ్యా నీ రూపం
తోడుగ నిలచి వెతలను తీర్చగ పలికెదమయ్యా నీ నామం
॥ కన్నుల ॥
॥ చరణం ౨ ॥
విరి సుమాల మాలికలల్లిముక్తికోరి నీ పదములు పలికి
నియమము తోడ నిను కీర్తించి
నయవినయముల నిత్యము కొలిచి
నీ అభయములె కోరిన మాకు అండగ నిలచే నీ తేజం
నీ చరణములె తాకిన చాలు మెండుగ కలిగే సంతోషం
॥ కన్నుల ॥
🕉️ జ్యోతి స్వరూపా అయ్యప్పా 🕉️