🕉️ కన్నెస్వామి గురుస్వామి 🕉️
─── అయ్యప్ప కీర్తన ───
॥ పల్లవి ॥
కన్నెస్వామి గురుస్వామి నిను చూడగ వచ్చాముకన్నులార నిన్ను చూడ నీ సన్నిధి కొస్తాము
ఎందుదాగి వున్నావయ్యో అయ్యప్పస్వామి
తొందరగా రావేమయ్యో అయ్యప్పస్వామి
॥ కన్నె ॥
॥ చరణం ౧ ॥
నలుబది రోజులు మేము దీక్షలన్నీ చేసాముపంపానదినీ చేరి జలకములే ఆడేము
ఏకాంత వాసుడైతివో అయ్యప్పస్వామి
ఎరుమేలిలో దాగివుంటివో అయ్యప్పస్వామి
॥ కన్నె ॥
॥ చరణం ౨ ॥
కులమత భేదాలు లేని కలియుగ వరదుడవు నీవునీతీ నియమాలతోడ నీ సన్నిధి కొచ్చేము
వట్టి మాటలివి కావయ్యో అయ్యప్పస్వామి
మెట్లకే దండాలయ్యో అయ్యప్పస్వామి
గురుడుకే దండాలయ్యో అయ్యప్పస్వామి
జ్యోతికే దండాలయ్యో అయ్యప్పస్వామి
మకర జ్యోతికే దండాలయ్యో అయ్యప్పస్వామి
॥ కన్నె ॥
🕉️ స్వామియే శరణం అయ్యప్ప 🕉️