నిను మరవలేను తండ్రి - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

నిను మరవలేను తండ్రి నిను మరవలేను

నిమిషమైన నిన్ను నేను చూడకుండలేను
నను నేను మరచినాను నిన్నే తలచినాను
తనువందు నిన్ను నిలిపి శరణు పలికినాను

అనుపల్లవి:-)
ఈ జీవం నీ సర్వం
ఏ జన్మల నా పుణ్యం (2)
అయ్యప్ప నీ నామం, అది నాకు గొప్ప వరం...!

చరణం - 1

ఒకానొకనాడు నాకు
స్వామి కలలకొచ్చినాడు
చిరునవ్వుల తేజముతోను
నన్ను తట్టిలేపినాడు
ఉలికిపడి లేచినాను
కంటతడి నే పెట్టాను

అనుపల్లవి:-)
కనిపించని ఏదో శక్తి
నను కలవరపెట్టెను భక్తి
నా కంటికి అది ఒక ప్రాప్తి
అయ్యప్ప ఇయ్యవా ముక్తి

చరణం - 2

స్వామి భజన చేస్తూవుంటే
ఏదో తెలియని ఆనందం
నా పక్కన కూర్చున్నట్టే
మనసుకు కలిగే సంతోషం
పరవశించి పోతినేను
పరితపించి వేడినాను

అనుపల్లవి:-)
తరతరాల చెరగని బంధం
ఈ భక్తునికెంతటి భాగ్యం
మరవబోదు నా ప్రాణం
అయ్యప్ప నీ రూపం...!

చరణం - 3

నాటి నుంచి నేటి వరకు
నా గానమే నీ కొరకు
నా కంఠ ఊపిరి బతుకు
ఉన్నది నీ సేవ కొరకు
ఉట్టి మాట కాదు స్వామి
ఒట్టు వేస్తున్నా స్వామి

అనుపల్లవి:-)
మట్టిలోనా కలిసే దాకా
మరవలేను అయ్యప్ప మాలా
నీ చల్లని పాదం నీడ
ఉండాలి అయ్యప్ప దేవా..!

స్వామియే శరణం అయ్యప్పా 🙏

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow