గాలిలోన దీపమోలే వెలుగుతున్న ప్రాణము నాదయ్య...
అది ఆరిపోయే లోపు అయ్యప్ప
నిన్ను చూడాలనుందయ్యా.............
నా మనసులోని మణికంఠని రూపం
నిలుపుకుంటినయ్య... (2)
నా కంఠంలో ఈ జీవం ఉన్నంత వరకు
నీ సేవ చేస్తున్నయ్య............
(గాలిలోన దీపమోలే).............
కన్న తల్లీ తండ్రి కన్నీళ్లకు
నేను కారణమైతిని...
కాస్తనైనా వాళ్ల ప్రేమను నోచని
పాపిష్టిని నైతిని.... (2)
తల్లీ తండ్రి లేనిది నేను లేనని
తెలుసుకున్నాను.
నా రెండు కాళ్లు నడవని రోజు ఉందని
తెలియదు నాకు....
నీ కొండకు నడిచి రావనున్నది
స్వామి అయ్యప్ప.... (2)
నీ భక్తుడయ్యే భాగ్యము ఇవ్వవా
స్వామి మణికంఠ...........
(గాలిలోన దీపమోలే)...........
ధనము ఉన్నదని మదముతోనే
ధర్మమన్నదే మరిచితిని..
వాళ్లని వీళ్లని బాధపెట్టి
పైసా కరువుల్లో పడిపోతిని.... (2)
ఏది గొప్పది కాదని
నేను కండ్లు తెరుచుకుంటినయ్య..
నాది నిధి. నువ్వు నేనని
భేదము మరిచితినయ్య.....
ఏది శాశ్వతం కాదని
నాది అన్నది నా తోడు రాదని.... (2)
నేను ఉన్నన్ని రోజులు ఊపిరి
అది లేకుంటే చివరికి ఆవిరి.... ఇ........
స్వామియే శరణం అయ్యప్పా 🙏