సాయంకాల సమయంలో సంధ్యా దీపారాధనలో
వచ్చేను జ్యోతి రూపాన
వరాల తండ్రి అయ్యప్ప ||కోరస్||
స్వామి శరణం శరణం అయ్యప్ప ||2||
కాళ్లకు గజ్జలు కట్టుకుని
పట్టు పంచను చుట్టుకుని
కంఠాన మణిహారం వేసుకుని
కదిలిండమ్మ మణికంటుడే ||కోరస్||
స్వామి శరణం శరణం అయ్యప్ప ||2||
శ్రీశైల మల్లన్న కొడుకంట
తిరుమల వెంకన్న తనయుడట
లాల పోశను గౌరమ్మ
ఉయ్యాలలుపెను లక్ష్మమమ్మ ||కోరస్||
స్వామి శరణం శరణం అయ్యప్ప ||2||
విల్లు బాణం పట్టుకుని
పులిపైన బాలుడు వస్తుంటే
కొమ్మ మీది కోయిలమ్మ పాడేనట
పురివిప్పి నెమలమ్మ ఆడేనట ||కోరస్||
స్వామి శరణం శరణం అయ్యప్ప ||2||
కమ్మని పాటలు పాడంగా
కన్నిస్వాములంతా ఆడంగా
కత్తి, గద, గంటస్వామి వేడంగా
గురుస్వామి దీవెనలు పొందంగా ||కోరస్||
స్వామి శరణం శరణం అయ్యప్ప ||2||
సాయంకాల సమయంలో సంధ్యా దీపారాధనలో
వచ్చేను జ్యోతి రూపాన
వరాల తండ్రి అయ్యప్ప ||కోరస్||
స్వామి శరణం శరణం అయ్యప్ప ||2||
స్వామియే శరణం అయ్యప్పా 🙏