- అయ్యప్ప@పువ్వులార అయ్యప్పస్వామి పూజకు వస్తరా - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

పువ్వులార అయ్యప్పస్వామి పూజకు వస్తరా

పూజకు వచ్చి స్వామిని మెచ్చి మీరు చూస్తరా
స్వామి కొరకు తోటలో రోజూ విరబూస్తరా
స్వామికి పూదండగా కోవెలకు వస్తరా

పూర్వజన్మ పుణ్యమో పువ్వులుగా పుట్టితిరీ
సర్వదేవతలకు మీరు మెదలోన మెట్టితిరీ
మేము కూడ పువ్వులమైతే ఎంతో బాగుండేదీ
మలయాళ మణికంఠుని మందిరమేగి ఉండేది

రకరకాల పువ్వులతో రంగు రంగుల పూలతో
అంగరంగ వైభవంగా పూలహార మల్లికతో
స్వామి మెడన వేస్తరూ స్వాములంతా చూస్తరూ
స్వామితో పాటు మీకు సరిగదండం చేస్తారూ

స్వామియే శరణం అయ్యప్పా 🙏

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow