పంచగిరీశా పాలించయ్యా - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

```html

🕉️ పంచగిరీశా 🕉️

పల్లవి
పంచగిరీశా పాలించయ్యా
పరంధామా లాలించయ్యా
పరమార్ధం బోధించయ్యా
పరమపదము అందించయ్యా
స్వామియే శరణము స్వామీ
నీ చరణమే శరణము స్వామీ
చరణం – 1
నియమాల మాలధారణం
ఇలలోనే ముక్తి తోరణం
నీ దీక్ష చేసుకుంటుంటాము
నీ రక్ష కోరుకుంటుంటాము
స్వామియే శరణము స్వామీ
నీ చరణమే శరణము స్వామీ
చరణం – 2
మధురం నీ నామస్మరణం
నీ స్పురణం పాపహరణం
నిన్ను పిలుచుకుంటుంటాము
నిన్ను తలచుకుంటుంటాము
స్వామియే శరణము స్వామీ
నీ చరణమే శరణము స్వామీ
చరణం – 3
కలిలో కామితార్ధ కారకం
శబరియాత్ర క్షేమదాయకం
ఇరుముడులే తెస్తుంటాము
నీ కొండకొస్తుంటాము
స్వామియే శరణము స్వామీ
నీ చరణమే శరణము స్వామీ
చరణం – 4
నీ పూజనం నీ సేవనం
నీ దర్శనం కడుపావనం
నీ పడి అధిరోహణం
సకల పాపహరణం
🕉️ స్వామియే శరణము స్వామీ 🕉️
నీ చరణమే శరణము స్వామీ
```

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow