సుందరమయ్యా నీ రూపం - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

```html

🕉️ సుందరమయ్యా 🕉️

పల్లవి
సుందరమయ్యా నీ రూపం
స్వామి అయ్యప్ప
సుమధురమయ్యా నీ నామం
శరణం అయ్యప్ప
చరణం – 1
చూచేకొద్ది చూడాలనిపించేది నీ మోము
చేతులు జోడించి నీముందు
ప్రార్ధించుతుంటాము మేము
స్వామి అయ్యప్ప... శరణం అయ్యప్ప
చరణం – 2
పిలిచినకొద్ది పిలవాలనిపించేది నీ నామం
నిను తలచుకుంటూ పిలుచుకుంటూ
ధ్యానించుతుంటాము నీ ధామం
స్వామి అయ్యప్ప... శరణం అయ్యప్ప
చరణం – 3
శరణాగత శరణంటూ
నీ శరణాలు పాడుతాము
నీ సన్నిధి మాకందించమంటూ
నీ చరణాలు వేడుతాము
స్వామి అయ్యప్ప... శరణం అయ్యప్ప
చరణం – 4
కోరిన కోర్కెలు తీర్చే
కలియుగ వరదుడవు
పాపాలను పరిమార్చే
పంచగిరుల పరంధాముడవు
స్వామి అయ్యప్ప... శరణం అయ్యప్ప
🕉️ స్వామియే శరణం అయ్యప్ప 🕉️
స్వామి అయ్యప్ప... శరణం అయ్యప్ప
```

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow