అయిదుకొండల్లో కొలువున్న దేవా - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్పా - అయిదుకొండల్లో
ॐ

ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్పా

9. అయిదుకొండల్లో ....
ప

అయిదుకొండల్లో కొలువున్న దేవా

నా గుండెల్లో నీవు కొలువుండిపోవా

కోట్లల్లో వున్నారు నిను కొలుచువారు

నిను నమ్ముకోని నిను పిలుచువారు

నిను సేవించుకుంటున్న దాసానుదాసుండ

నీ అండదండ అందించవా

నీ కొండకు స్వామి రప్పించావా

చ ౧

నీ మాటలే నే మాటాడుతుంటా

నీ పాటలే నే పాడుతుంటా

నీ బాటలోనే నడవాలనుకుంటా

నీ చోటికే నే చేరాలనుకుంటా

నా మాట మణికంఠ మన్నించవా

నీ కృపను నాపై కురిపించవా

చ ౨

నీ నామమే జపించాలనీ

నీ కోసమే తపించాలనీ

నిత్యమ్ము నిన్ను ధ్యానించాలని

నీ పాదమే పూజించాలని

నా ఆశ తీర్చంగలేవా

నా ధ్యాసలో నిలిచిపోవా

చ ౩

నన్నో పువ్వుగా మార్చెయ్యి స్వామి

నీ పాదాలచెంత చేర్చెయ్యి స్వామి

దీపకాంతుల్లో నీమోము చూపించవా

దివ్యానుభూతి కలిగించవా

అందాల అయ్యప్ప దేవా

నీ సన్నిధానం ప్రసాదించవా

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow