పచ్చపచ్చని చెట్టురా
చెట్టు మీద రామచిలుకరా 🌿
పచ్చపచ్చని చెట్టురా
చెట్టు మీద రామచిలుకరా
రామచిలక నోట ఎల్లవేలలా
స్వామి నామమే పలుకురా
ఈ స్వామి నామమే పలుకురా ||2||
ఒక్కా నొక రోజున చిలక నాసెంతకు కొచ్చెరా
స్వామి స్వామి అంటూ నన్ను పేరు పెట్టి పిలువ సాగెరా ||2||
ఎటమ్మ చిలకమ్మ ఏటని అడిగితే...... ||2||
ఆకుల్లో తల పెట్టి ఎక్కెక్కి ఏడ్చింది
చింతలేక చెట్టు పైన చిలకగోరింకలైన
ఊసులాడుకుంటూ ఈఊరేమరిచి పాయినవి ||2||
అట్టి ఆ జంటను బోయవాడు చూసెను
చిలకమ్మను చూసి విలుఎక్కుపెట్టెను
అది జూసి గోరింక చిలుక కడ్డువచ్చెరా
గోరింక కంటికి గాయమైనదిరా
గోరింక కంటిచూపు చిలకకు కరువాయెరా...
గాయమైన గోరింకకు అన్ని తానైనది
తనకంటితోనే లోకాన్ని చూపుతున్నది
రామచిలుక ఒకనాడు స్వామి పూజచూసెను
పూజలోన గురుస్వామి మహమలెన్నో చెప్పెను ||2||
నడవలేనివారు కొండనడిచి వెళ్లారని
మాటరాని వారు పాట పాడుతున్నారని
చూడలేని వారు జ్యోతి చూచుచున్నారని
అట్టియా రామ చిలక స్వామి మాల వేయమని
నన్ను వేడుకున్నది బ్రతిమిలాడుకున్నది
మండల వ్రతమును మరువక చేతునని
తన ఇరుముడిని నా తల మీద ఉంచమని ||2||
ఇరుముడిలోన తనుగోరింక వచ్చునని
మహిమల మణికంఠుని కనులారగాంతునని
ఆ జ్యోతి దర్శనం గోరింకకు చూపమని
📖 పాట కథ సారాంశం
ఒక పచ్చని చెట్టు మీద రామచిలుక ఎల్లప్పుడూ స్వామి నామం జపిస్తూ ఉంటుంది. చిలక-గోరింక జంటగా సంతోషంగా ఉండేవి. ఒకనాడు బోయవాడు చిలకను చూసి బాణం వేయగా, గోరింక అడ్డువచ్చి కంటికి గాయమై చూపు కోల్పోయింది. అప్పటి నుంచి చిలక గోరింకకు అన్ని తానై సేవ చేస్తుంది. స్వామి మహిమలు విన్న చిలక, గోరింక కోసం ఇరుముడి కట్టి శబరిమల యాత్ర చేసి జ్యోతి దర్శనం చూపించాలని వేడుకుంటుంది. 🙏