67. జంటముడులు కట్టుకొని / Janta Mudulu Kattukoni - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

🌺 జంటముడులు కట్టుకొని 🌺

జంటముడులు కట్టుకొని - భక్తి వెంట పెట్టుకొని ||కో||
బయలుదేరి పోదామా స్వామి - బయలుదేరి పోదామా స్వామి ||కో||
శరణం శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా ||కో||
నీకు శరణమయ్యప్పా - మాకు మోక్షమయ్యప్పా ||కో||

స్వార్థం పరమార్థం - ముడులక్రింద పెట్టుకొని ||కో||
కామ క్రోధాలను - కులమత భేదాలను ||కో||
వదిలిపెట్టి పోవుదామా స్వామి - వదిలిపెట్టి పోవుదామా స్వామి ||కో||
శరణం శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా ||కో||
నీకు శరణమయ్యప్పా - మాకు మోక్షమయ్యప్పా ||కో||

॥జంటముడులు॥

పెద్దపులి వాహనుడా పార్థసారథి కుమారుడా ||కో||
మహిషి సంహారిని మణికంఠ రూపుని ||కో||
దర్శనమే చేయుదామా స్వామి - దర్శనమే చేయుదామా స్వామి ||కో||
శరణం శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా ||కో||
నీకు శరణమయ్యప్పా - మాకు మోక్షమయ్యప్పా ||కో||

॥జంటముడులు॥

పంబలో స్నానమాడి - శరంగుత్తి చేరుకొని ||కో||
శరణు శరణు శరణంటూ పదినిమిది మెట్లెక్కి ||కో||
అభిషేకము చేయుదామా స్వామిని - అభిషేకము చేయుదామా స్వామిని ||కో||
శరణం శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా ||కో||
నీకు శరణమయ్యప్పా - మాకు మోక్షమయ్యప్పా

॥జంటముడులు॥

॥ స్వామియే శరణం అయ్యప్ప ॥

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow