శ్యామ సుందరంటి వాలే
శ్రీ కృష్ణ జానపద భక్తి గీతం
బాల కృష్ణ లీలలుపల్లవి
శ్యామ సుందరంటి వాలే ఓ మురళి వాలే
ఓ మురళవాలే ఓ బన్సీ వాలే (2)
1
నల్ల నల్లనివాడు మూడు నామాలవాడు
మూడు నామాలవాడు ఏ మూల దాగినాడు
ఏ మూల దాగినాడు ఏ మంద కేగినాడు
చూడమ్మా అరే చూడమ్మా అరే చూడమ్మ
యశోదమ్మా మీ వాడి అల్లరి
మా వాడు మా ఇంట లేడే ఓ భామలారా
ఓ భామలారా ఓ చెలియలారా
యశోదమ్మా మీ వాడి అల్లరి
మా వాడు మా ఇంట లేడే ఓ భామలారా
ఓ భామలారా ఓ చెలియలారా
(శ్యామ సుందరంటి వాలే)
❋ ❋ ❋
2
గొల్ల వాడల్లోన వెన్న దొంగిలించినాడు
వెన్న దొంగిలించినాడు భామలతో ఆడినాడు
యశోదమ్మ ఇంటిలోన ఏ మూల దాగినాడు
చూడమ్మా, అరే చూడమ్మా (2)
మావాడు మాఇంట లేడే ఓ భామలారా
ఓ భామలారా, ఓ చెలియలారా
మావాడు మాఇంట లేడే ఓ భామలారా
ఓ భామలారా, ఓ చెలియలారా
(శ్యామ సుందరి వాలే)
❋ ❋ ❋
3
కాళింగ మడుగులోన తకధిమితక లాడినాడు
తకధిమితక లాడినాడు ఏ మంద కేగినాడు
గోవర్ధనగిరి ఎత్తి ఏ మూల దాగినాడు
చూడమ్మా అరే చూడమ్మా
యశోధమ్మా మీ వాడి అల్లరి
యశోధమ్మా మీ వాడి అల్లరి
(శ్యామ సుందరి వాలే)