Seva Chese Lyrics || సేవ చేసే లిరిక్స్ – హనుమాన్ భజన పాట

సేవ చేసే భాగ్యమడిగితిని శ్రీమారుతీ

సేవ చేసే భాగ్యమడిగితిని
సేవ కన్నా మిన్న యైనది ఏది లేదని తెలిపినా
నీ సేవ చేసే భాగ్యమడిగితిని శ్రీమారుతీ

సేవ చేసే భాగ్యమడిగితిని శ్రీమారుతీ
సేవ చేసే భాగ్యమడిగితిని

1. చరణం

సేవ చేసి నంది పొందెను శివ సమీప వాసము
సేవ చేసి పక్షి పొందెను స్థిర వైకుంఠ నివాసము
సేవ చేసిన నీకు కలుగును దైవత్వము
జీవ భారము మరచిపోయి చిరంజీవి వైతివా

సేవ చేసే భాగ్యమడిగితిని శ్రీమారుతీ
సేవ చేసే భాగ్యమడిగితిని

2. చరణం

సేవ వలన నాకు కలుగును పావనమగు నీదు కరుణ
సేవ చేసి ధన్యమొంది చిగురు వేయును నాదు జన్మ
సేవ చేసి బొందిలోని శ్రీరాముని నిలుపుకొన్నా
నీ సేవ చేత లభ్యమగును చిన్మయానంద సేవా

సేవ చేసే భాగ్యమడిగితిని శ్రీమారుతీ
సేవ చేసే భాగ్యమడిగితిని

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow