లిరిక్స్ : Pallavi: || ఇతడే పరబ్రహ్మ మిదియె రామకథ | శతకోటి విస్తరము సర్వపుణ్య ఫలము || Charanams: || ధరలో రాముడు పుట్టె ధరణిజ బెండ్లాడె | అరణ్య వాసులకెల్ల నభయమిచ్చె | సొరిది ముక్కుజెవులు చుప్పనాతికిని గోసె | ఖరదూషణులను ఖండించి వేసె || || కినిసి వాలి జంపి కిష్కింద సుగ్రీవుకిచ్చె | వనధి బంధించి దాటె వానరులతో | కవలి రావణ కుంభకర్ణాదులను జంపి | వనిత జేకొని మళ్ళివచ్చె నయోధ్యకును || || సౌమిత్రియు భరతుడు శత్రుఘ్నుడు గొలువగ | భూమి యేలె కుశలవ పుత్రుల గాంచె | శ్రీమంతుడై నిలిచె శ్రీవేంకటాద్రి మీద | కామించి విభీషణు లంకకు బట్టముగట్టె ||🙏🙏🙏

 బ్రహ్మ మొకటే పరబ్రహ్మ మొకటే |

పరబ్రహ్మ మొకటే పరబ్రహ్మ మొకటే ||


తందనాన ఆహి తందనాన పురె |

తందనాన భళా తందనాన


కందువగు హీనాధికము లిందు లేవు |

అందరికి శ్రీహరే అంతరాత్మ |

ఇందులో జంతుకులమింతా నొకటే |

అందరికి శ్రీహరే అంతరాత్మ ||


నిండార రాజు నిద్రించు నిద్రయు నొకటే |

అండనే బంటునిద్ర అదియు నొకటే |

మెండైన బ్రాహ్మణుడు మెట్టుభూమి యొకటే |

చండాలు డుండేటి సరిభూమి యొకటే ||


అనుగుదేవతలకును అలకామ సుఖమొకటే |

ఘనకీట పశువులకు కామ సుఖమొకటే |

దినమహో రాత్రములు తెగి ధనాఢ్యునకొకటే |

వొనర నిరుపేదకును వొక్కటే అవియు ||


కొరలి శిష్టాన్నములు గొను నాకలొకటే |

తిరుగు దుష్టాన్నములు తిను నాకలొకటే |

పరగ దుర్గంధములపై వాయువొకటే |

వరుస బరిమళముపై వాయువొకటే ||


కడగి యేనుగు మీద గాయు యెండొకటే |

పుడమి శునకము మీద బొలయు నెండొకటే |

కడు బుణ్యులను బాప కర్ములను సరిగావ |

జడియు శ్రీ వేంకటేశ్వర నామమొకటే ||🙏🙏🙏

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow