Jagadapu Chanuvula Lyrics || జగడపు చనువుల లిరిక్స్ – వెంకటేశ్వర స్వామి భజన పాట

 జగడపు చనువుల జాజర – సగినల మంచపు జాజర

1. మొల్లలు తురుములు ముడిచిన బరువున
మొల్లపు సరసపు మురిపెమున
జల్లన పుప్పొడి జారగ బతిపై
చల్లే రతివలు జాజర

జగడపు చనువుల జాజర – సగినల మంచపు జాజర

2. భారపు కుచముల పైపై కడు
సింగారపు నెరపెడి గంధ వొడి
చేరువ పతిపై చిందగ పడతులు
సారెకు జల్లేరు జాజర

జగడపు చనువుల జాజర – సగినల మంచపు జాజర

3. బింకపు కూటమి పెనగటి చెమటల
పంతపు పూతల పరిమళము
వేంకట పలివై వెలదులు నించేరు
సరి కుమదంబుల జాజర

జగడపు చనువుల జాజర – సగినల మంచపు జాజర

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow