హారతి పాట - Harathi Pata

```html
Ayyappa Swamy

హారతి పాట

శ్రీ శబరిగిరివాస అభయ ప్రదాత
అభయహస్తా నీకు జయ మంగళం నిత్య శుభమంగళం
|| శ్రీ శబరిగిరివాస ||

కోనల ఉండేటి కరుణాంతరంగా
కాచిబ్రోచే నీకు జయ మంగళం నిత్య శుభమంగళం
|| శ్రీ శబరిగిరివాస ||

అష్టాదశసోపాన అయ్యప్ప దేవా
అవనినేలే నీకు జయ మంగళం నిత్య శుభమంగళం
|| శ్రీ శబరిగిరివాస ||

నెయ్యాభిషేకాన నవనీత హృదయా
నన్ను బ్రోచే నీకు జయ మంగళం నిత్య శుభమంగళం
|| శ్రీ శబరిగిరివాస ||

శరణాలనందేటి జ్యోతి స్వరూపా
జగమేలు నీకు జయ మంగళం నిత్య శుభమంగళం
|| శ్రీ శబరిగిరివాస ||

హరిహరానందన హృదయాంత వాసా
హారతీ నీకిదే జయ మంగళం నిత్య శుభ మంగళం
|| శ్రీ శబరిగిరివాస ||

```

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow