Govindha Maa Lyrics | గోవిందా మామీద లిరిక్స్ – వెంకటేశ్వర స్వామి భజన పాట

 గోవిందా మామీద నీదయ రాదేలనయ్యా

మా మొరలే వినలేవా నీ కరుణ చూపరావా

గోవిందా మామీద నీదయ రాదేలనయ్యా
మా మొరలే వినలేవా నీ కరుణ చూపరావా

1. నీ మనసే చల్లనిది – జగమంతా నిండినది
నారాయణ నీనామం – గానముగా మారినది
గోవిందా యని పిలచితిని – నీపద సన్నిది నిలచిలిని
గోకుల బాలా మా పై నీదు కరుణ చూపరావా

గోవిందా మామీద నీదయ రాదేలనయ్యా
మా మొరలే వినలేవా నీ కరుణ చూపరావా

2. నీ సన్నిది నిలుచుటకు – కొందరికే దొరికేది
మాభాగ్యం ఈనాడు – నీ సేవే దొరికినది
గోవిందా యని పిలచితిమి – నీ భజనలు చేయుచు
పిలచితిమి
భజనలు చేసే భక్తులపైన – కరుణ చూపరాదా

గోవిందా మామీద నీదయ రాదేలనయ్యా
మా మొరలే వినలేవా నీ కరుణ చూపరావా


#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow