@ దిగు దిగు దిగు నాగ @ Digu digu Naganna @ నాగరాజ భజన పాటల లిరిక్స్ @ Nagaraja Bhajana Patala lyrics in Telugu

దిగు దిగు దిగు నాగ నాగన్న - నాగన్న భక్తి గీతం

🐍 దిగు దిగు దిగు నాగ నాగన్న 🐍

దిగు దిగు దిగు నాగ నాగన్న

దివ్య సుందర నాగో నాగన్న |2|..

ఇల్లలికి ముగ్గు పెట్టి నాగన్న

ఇంటా మల్లెలు జల్లి నాగన్న

మల్లెలా వాసనతో నాగన్న

కోలాట మాడి పోరా నాగన్న

|| నాగన్న ||

దిగు దిగు దిగు నాగ నాగన్న

దివ్య సుందర నాగో నాగన్న |2|..

బామలు అందరు చేరి నాగన్న

బావి నీళ్ల కెలితే నాగన్న

బావిలో ఉన్నావ నాగన్న

బాల నాగు వయ్యో నాగన్న

|| నాగన్న ||

దిగు దిగు దిగు నాగ నాగన్న

దివ్య సుందర నాగో నాగన్న |2|..

పిల్లలు అందరు చేరి నాగన్న

పుల్లా లేరా బోతే నాగన్న

పుల్లలో ఉన్నావ నాగన్న

పిల్ల నాగు వయ్యో నాగన్న

|| నాగన్న ||

దిగు దిగు దిగు నాగ నాగన్న

దివ్య సుందర నాగో నాగన్న |2|..

స్వాములు అందరు చేరి నాగన్న

రేవు నీళ్ల కెలితే నాగన్న

రేవులో ఉన్నావ నాగన్న

ఎర్ర నాగు వయ్యో నాగన్న

|| నాగన్న ||

దిగు దిగు దిగు నాగ నాగన్న

దివ్య సుందర నాగో నాగన్న |2|..

అటు కొండ ఇటు కొండ నాగన్న

నడుమ నాగుల కొండ నాగన్న

కొండలో ఉన్నవా నాగన్న

కోడే నాగు వయ్యో నాగన్న

|| నాగన్న ||

దిగు దిగు దిగు నాగ నాగన్న

దివ్య సుందర నాగో నాగన్న |2|..

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow